close
నువ్వులో సస్యరక్షణ

న్యూస్‌టుడే, ఒంటిమిట్ట

బీలో ఆరుతడి పంటగా సాగు చేసిన నువ్వులో చీడపీడల నివారణకు చేపట్టాల్సిన సస్యరక్షణ చర్యలను ఊటుకూరు ఏరువాక కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్‌ ఎ.వీరయ్య (ఫోన్‌: 99896 23811) సూచించారు.
విత్తనశుద్ధి: ముందస్తుగా సాగుచేసిన పంటలో వేరు, కాండంకుళ్లు తెగులు ఆశించి తీవ్రనష్టం కలిగిస్తోంది. ప్రస్తుతం పంట విత్తే రైతులు.. కిలో విత్తనానికి 3 గ్రా. చొప్పున కార్బండజిమ్‌ కలిపి శుద్ధిచేసి విత్తాలి. ఈ చర్య వల్ల పంట తొలిదశలో తెగుళ్ల బెడద తగ్గుతుంది.

పురుగులు
రసంపీల్చే పురుగులు: ఇవి ఆకుల అడుగు భాగాన చేరి రసాన్ని పీల్చడం వల్ల ఆకులు పాలి, ఎండిపోతాయి. తెల్లనల్లి ఆశిస్తే.. ఆకులు ముదురాకుపచ్చ రంగులోకి మారి, ఈనెలు పొడవుగా సాగి వెనక్కి ముడుచుకొని దోనె ఆకారంలోకి మారి పాలిపోతాయి. వీటి నివారణకు.. లీటరు నీటికి మోనోక్రోటోఫాస్‌ 1.6 మి.లీ. లేదా డైమిథోయేట్‌ 2 మి.లీ చొప్పున కలిపి పిచికారీ చేయాలి. తెల్లనల్లి నివారణకు.. లీటరు నీటికి డైకోఫాల్‌ 5 మి.లీ. లేదా డైమిథోయేట్‌ 2 మి.లీ. చొప్పున కలిపి పిచికారీ చేయాలి.    
ఆకుముడత, కాయతొలుచు పురుగు: వీటి తొలిదశ లార్వాలు ఆకులను గోకి తినడం వల్ల ఆకులు ఎండుతాయి. లార్వాలు గొంగళి పురుగుగా ఎదిగి ఆకులను గూడుగా చేసుకొని తిని నష్టపరుస్తాయి. మొగ్గ ఏర్పడే దశలో మొగ్గలు, పూత, కాయల్లోని లేత గింజలను తింటూ పంటకు తీవ్రనష్టాన్ని కలిగిస్తాయి. నివారణకు లీటరు నీటికి మోనోక్రోటోఫాస్‌ 1.6 మి.లీ. లేదా క్వినాల్‌ఫాస్‌ 2 మి.లీ. లేదా క్లోరిపైరిఫాస్‌ 2.5 మి.లీ. చొప్పున కలిపి పిచికారీ చేయాలి.

తెగుళ్లు
కాండం ఎండు తెగులు : కాండంపై గోధుమ రంగు మచ్చలు ఏర్పడి, క్రమంగా నల్లగా మారుతాయి. నివారణ లీటరు నీటికి 3 గ్రా. మాంకోజెబ్‌ లేదా కాపర్‌ ఆక్సీక్లోరైడ్‌ కలిపి పిచికారీ చేయాలి.
ఆకుమచ్చ (ఆల్టర్నేరియా) తెగులు : గాలిలో తేమ పెరిగినప్పుడు ఈ తెగులు అధికంగా వ్యాపిస్తుంది. ఆకులు, కాండంపై గోధుమరంగు మచ్చలు ఏర్పడతాయి. ముదురు గోధుమ రంగులో చిన్న వలయాకార మచ్చలు ఆకంతా వ్యాపించి ఆకులు ఎండి, రాలిపోతాయి. నివారణకు లీటరు నీటికి.. కార్బండిజమ్‌ 1 గ్రాము లేదా మాంకోజెబ్‌ 3 గ్రా. చొప్పున కలిపి 15 రోజుల వ్యవధిలో 2-3 సార్లు పైరుపై పిచికారీ చేయాలి.  

బూడిద తెగులు: ఆకులపై బూడిద వంటి పదార్థం ఏర్పడి, తెల్లటి శిలీంద్రం పెరుగుతుంది. సకాలంలో నివారించకపోతే.. తెగులు పంటంతా వ్యాపించి గింజ బరువు తగ్గుతుంది.  
నివారణకు లీటరు నీటికి.. హెక్సాకొనజోల్‌ 2 మి.లీ. లేదా ప్రొపికొనజోల్‌ 1 మి.లీ. లేదా నీటిలో కరిగే గంధకం 3 గ్రా. చొప్పున కలిపి పిచికారీ చేయాలి.

వెర్రి తెగులు: ఈ తెగులు సోకిన మొక్కలోని పువ్వు భాగాలన్నీ ఆకుల మాదిరిగా మారి కాయలు ఏర్పడవు. ఈ తెగులు దీపపు పురుగుల ద్వారా వ్యాప్తి చెందుతుంది. ఈ పురుగుల నివారణకు లీటరు నీటికి మిథైల్‌డెమటాన్‌ 1 మి.లీ. లేదా డైమిథోయేట్‌ 2 మి.లీ. చొప్పున కలిపి పైరుపై పిచికారీ చేయాలి.

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.