close
తేనెటీగల పెంపకానికి రాయితీలు!

కుటీర పరిశ్రమగా ఉపాధి
- న్యూస్‌టుడే, జంగారెడ్డిగూడెం (అర్బన్‌)

నేక ఔషధ గుణాలున్న తేనెకు నిత్యం డిమాండ్‌ ఉంటుంది. ఆరోగ్య ప్రదాయణిగా, సౌందర్య సాధనంగా తేనె వాడకం పెరుగుతోంది. సరైన అవగాహనతో కుటీర పరిశ్రమగా తేనెటీగల పెంపకం చేపడితే.. స్థిరమైన ఆదాయం లభిస్తుందని పశ్చిమగోదావరి జిల్లా, తాడేపల్లిగూడెం మండలం వెంకట్రామన్నగూడెం కృషి విజ్ఞాన కేంద్రం (కేవీకే) కీటక విభాగ శాస్త్రవేత్త డాక్టర్‌ జి.శాలిరాజు (94914 10128) తెలిపారు. ప్రారంభంలో తక్కువ తేనెటీగలతో పెంపకం చేపట్టి, అనుభవం వచ్చాక వాటి సంఖ్యను పెంచుతూ అధిక లాభాలు ఆర్జించవచ్చు. తేనెటీగల పెంపకానికి నిపుణుల ఆధ్వర్యంలో ప్రాథమిక శిక్షణ తప్పనిసరి. ఒకరిని చూసి మరొకరు పెంపకం చేస్తే.. నష్టాలు వస్తాయి. తేనెటీగల్లో అయిదు జాతులున్నప్పటికీ.. దేశవాళీ, ఐరోపా తేనెటీగలు మాత్రమే పెంపకానికి అనువైనవి.
అనువైన ప్రదేశాలు
తేనెటీగలకు పువ్వుల్లో ఉండే పుప్పొడి, మకరందమే ఆహారం. నాణ్యమైన తేనె ఉత్పత్తికి పుప్పొడి, మకరందంలను సమృద్ధిగా అందించగల పైర్లు, మొక్కలు లేదా తోటలు ఉన్న ప్రదేశాలు ఉండాలి.  
మకరందం, పుప్పొడి అందించేవి: నిమ్మ, నారింజ, బత్తాయి, ఉసిరి, వెలగ, జీడిమామిడి, అరటి, రేగు, దానిమ్మ, తాటి, పుచ్చ, జామ, మామిడి, దోస, గుమ్మడి, బీర, పొట్ల, కాకర, పొద్దుతిరుగుడు, ఆవాలు, నువ్వులు, కుసుమ.  
మకరందం అందించేవి: ఉసిరి, వెలగ, నేరేడు, కానుగ, టేకు, మునగ, యూకలిప్టస్‌, చింత, వేప, కుంకుడు.
పుప్పొడి అందించేవి : కొబ్బరి, ఆయిల్‌పామ్‌, జామ, దానిమ్మ, ఆముదం, వంగ, మిరప, టమాట, చిలగడదుంప, జొన్న, మొక్కజొన్న, సజ్జ, కొర్ర.
పాటించాల్సిన జాగ్రత్తలు
తేనెటీగల పెంపకంలో సరైన జాగ్రత్తలు తీసుకుంటే మంచి దిగుబడితో పాటు స్వచ్ఛమైన తేనె లభిస్తుంది. ఈ పెంపక యూనిట్ల వద్దకు వ్యాపారులే వచ్చి కొనుగోలు చేస్తున్నారు.
తేనెటీగలు చల్లని వాతావరణంలో చాలా ఉత్సాహంగా ఉండి, తేనెను అధికంగా తయారు చేస్తాయి. ఏప్రిల్‌, మేలో ఎండ వేడిమిని తట్టుకోలేవు. వర్షాకాలంలో అధిక వర్షాలకు తేనెటీగలు చనిపోయే ప్రమాదం ఉంటుంది. ఈ సమయాల్లో బెల్లాన్ని పాకంగా చేసి ఆహారంగా అందించాలి.
శిక్షణ పొందిన రైతులకు కృషి విజ్ఞాన కేంద్రంలోనే ఈగలు, పెట్టెలు లభిస్తాయి. ఈగలతో కలిపి పెట్టె రూ.5 వేలకు అందిస్తారు. పెట్టె మాత్రం రూ.2 వేలకు అందిస్తున్నారు.
ఒక్కో యూనిట్‌కు ఉద్యానశాఖ నుంచి 40 శాతం రాయితీ అందిస్తున్నారు. అన్ని కులాల వారికి ఇదే రాయితీ వర్తిస్తుంది. ఎనిమిది పెట్టెలకు కలిపి రూ.20,800 రాయితీ ఇస్తారు.
ఎస్సీ, ఎస్టీ కార్పోరేషన్‌ ద్వారా తేనెటీగల పెంపకం యూనిట్లకు రుణాలు అందిస్తున్నారు.

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.