
రబీలో చలి కారణంగా వివిధ పైర్లలో సూక్ష్మ పోషక లోపాలు తలెత్తుతాయి. వీటి సవరణకు.. రసాయన ఎరువుల వాడకంలో పాటించాల్సిన మెలకువలను పాలెం కేవీకే సమన్వయకర్త డాక్టర్ టి.ప్రభాకర్‌రెడ్డి సూచించారు.
జింకు
* మొక్కల పెరుగుదలకు అవసరమైన ఎంజైమ్‌లు, హర్మోన్ల తయారీలో జింకు ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఈ పోషక లోపం ఎక్కువగా ఇసుక, చౌడు, సున్నపు నేలలతో పాటు భాస్వరం ఎక్కువగా ఉన్న సందర్భాల్లో, కొత్తగా చదును చేసిన నేలల్లోనూ కనిపిస్తుంది.
* వరి తర్వాత మళ్లీ వరి పండించే నేలల్లో జింకు లోపం ఎక్కువగా కనిపిస్తుంది. ఈ లోపం వల్ల వరి నాటిన 2-4 వారాల మధ్య లోప లక్షణాలు కనిపిస్తాయి. ఆకు చివర్లలో మధ్య ఈనెకు ఇరు పక్కలా తుప్పు రంగు లేదా ఇటుక రంగు మచ్చలు ఏర్పడి ఆకులు చిన్నవిగా పెళుసుగా మారిపోతాయి.
* మొక్కజొన్నలో ఆకుల ఈనెల మధ్యభాగాలు ఆకుపచ్చ రంగు కోల్పోయి పసుపు రంగుకు మారతాయి.
* వేరుశనగలో జింకు లోపం వల్ల ముదురాకుల ఈనెల మధ్యభాగం పసుపు రంగులోకి మారుతుంది. లేతాకులు చిన్నవిగా ఉంటాయి.
* జింకు లోపాన్ని గుర్తించిన వెంటనే.. లీటరు నీటికి 2 గ్రా. జింకు సల్ఫేట్ చొప్పున కలిపి పిచికారి చేయాలి. 4-5 రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారి చేసి జింకు లోపాన్ని నివారించవచ్చు.
బోరాన్
ఆకుల్లో తయారయ్యే ఆహారాన్ని మొక్కల్లో వివిధ భాగాలకు చేర్చడంలో బోరాన్ ముఖ్య పాత్ర పోషిస్తుంది. మొక్కలో కాల్షియం, పొటాషియం నిష్పత్తిని క్రమబద్ధీకరిస్తుంది.
* పొద్దుతిరుగుడు, వేరుశనగ పంటల్లో బోరాన్ లోపం సర్వ సాధారణం. ఈ లోపాన్ని సవరించేందుకు.. లీటరు నీటికి ఒక గ్రాము చొప్పున బోరిక్ ఆమ్లం లేదా బోరాక్స్ కలిపి పైరు విత్తిన 30 రోజులకు, తరువాత 45 రోజులకు పిచికారి చేయాలి.
* శనగ పంట కీలక దశలైన మొగ్గదశ, గింజ కట్టే దశల్లో, బెట్ట పరిస్థితుల్లో లీటరు నీటికి 20 గ్రాముల యూరియా చొప్పున కలిపి పిచికారి చేసి.. దిగుబడులు తగ్గకుండా కాపాడుకోచ్చు.
* వేరుశనగ పంటకు ఎకరాకు 200 కిలోల జిప్సంను పూతదశ పూర్తయి ఊడలు దిగే సమయంలో మొదళ్ల దగ్గర వేసి మట్టిని ఎగదోస్తే.. దిగుబడి పెరుగుతుంది.
* రబీలో మినుము, పెసర పంటల్లో పిందె, గింజకట్టే దశలో లీటరు నీటికి 20 గ్రా. యూరియా చొప్పున కలిపి పిచికారి చేస్తే.. పైరు బెట్టను తట్టుకోవడంతో పాటు దిగుబడులు పెరుగుతాయి.
ఇనుము
ఆకుల్లో పత్రహరితం, పిండి పదార్థం తయారీకి ఇనుము అవసరం. అధిక క్షార భూముల్లో, సున్నం ఎక్కువున్న నేలల్లో ఇనుపధాతు లోపాలు కనిపిస్తాయి. వరి, చెరకు, వేరుశనగ పంటల్లో లేత చిగురాకుల ఈనెల మధ్యభాగం పసుపురంగుకు మారుతుంది. లోప తీవ్రత ఎక్కువగా ఉంటే ఆకు పూర్తిగా తెల్లబడుతుంది. ఇనుపధాతు లోప నివారణకు.. లీటరు నీటికి 5 గ్రా. ఫెర్రస్ సల్ఫేట్ (అన్నభేది) + ఒక గ్రాము సిట్రిక్ ఆమ్లం లేదా నిమ్మరసం కలిపి వారం వ్యవధిలో రెండుసార్లు పిచికారి చెయ్యాలి.
మరిన్ని

దేవతార్చన
- మదనపల్లె ఘటన:వెలుగులోకి కొత్త విషయాలు
- 30ఏళ్లకు కలిసిన ముగ్గురు అన్నదమ్ములు
- కనిపెంచిన చేతులే.. కాటేశాయి
- పెళ్లి ముచ్చటపై రష్మి-సుధీర్ ఏమన్నారంటే?
- ఏపీలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించాల్సిందే: సుప్రీం
- ఎన్నికలను రీషెడ్యూల్ చేసిన ఎస్ఈసీ
- వద్దు నాన్నా.. అంటున్నా వినకుండా..!
- పది మంది భార్యలు.. కోట్ల ఆస్తి.. దారుణ హత్య!
- మళ్లీ జయభేరి మోగిస్తున్నా
- చైతన్య ప్రేమ సందేశం.. నిహారిక కన్నీళ్లు