close
వరిలో కాండంతొలుచు పురుగు

మార్టేరు ఏఆర్‌ఎస్‌ శాస్త్రవేత్తల సూచనలు
- న్యూస్‌టుడే, మార్టేరు (పెనుమంట్ర)

బీలో విత్తిన వరి ప్రస్తుతం పిలకలు వేసే దశలో ఉంది. ముదురు నాట్లు వేసిన ప్రాంతాల్లో ఈ పంటలో కాండం తొలుచు పురుగు ఎక్కువగా ఆశించి నష్టం కలిగిస్తోందని మార్టేరు వ్యవసాయ పరిశోధన స్థానం కీటక విభాగం సీనియర్‌ శాస్త్రవేత్త డాక్టర్‌ ఎం.నందకిషోర్‌ (94402 86682) తెలిపారు. రైతులు దీన్ని ఎక్కువగా ఊసపోటుగా పిలుస్తారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో దీని ప్రభావం కనిపిస్తోంది. ముఖ్యంగా తణుకు పరిసర ప్రాంతాల్లో ఈ పురుగు ఉధృత్తి ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. కాండం తొలుచు పురుగు ప్రభావం.. లక్షణాలు, నివారణ చర్యలను వివరించారు.

కాండం తొలుచు పురుగుల్లో తల్లి పురుగులు ఎండుగడ్డి రంగులో ఉంటాయి. ఇవి ఆకు చివరి భాగంలో గుడ్లు పెడుతుంది. ఒక్కో సముదాయంలో 50-80 గుడ్లు ఉంటాయి. ఇవి గోధుమ రంగు వెంట్రుకలతో కప్పబడి ఉంటాయి. ఈ గుడ్ల నుంచి 5-8 రోజుల్లో లార్వాలు బయటకు వస్తాయి. వాటి నోటి నుంచి వచ్చే తీగవంటి లాలాజలం సాయంతో కిందకు వేలాడి కాండానికి రంధ్రాలు చేసి మొవ్వును తినేస్తాయి. దీంతో మొవ్వు చనిపోయి చేతితో లాగితే సులభంగా వస్తుంది. దీన్ని మొవ్వు కుళ్ళు అంటారు.
 

నివారణ చర్యలు
చేలో ప్రతి చదరపు మీటరుకు ఒక గుడ్ల సముదాయం, ఒక ఆడ రెక్కల పురుగు, 5 శాతం చనిపోయిన మొవ్వులు.. వీటిలో ఏదో ఒకదాన్ని గమనించినప్పుడు మాత్రమే పురుగు మందులు పిచికారి చేయాలి.
ఈ పురుగు నివారణకు 10 లీటర్ల నీటికి మోనోక్రొటోఫాస్‌ 16 మి.లీ. లేదా ఎసిఫేట్‌ 15 గ్రాములు లేదా క్లొరాంట్రనిలిప్రోల్‌ 3 మి.లీ., చొప్పున కలిపి పిచికారి చేయాలి.
ఎకరానికి కార్బోప్యూరాన్‌ 3జి గుళికలు 10 కిలోలు లేదా కార్టాప్‌ హైడ్రోక్లోరైడ్‌ 4జి గుళికలు 8 కిలోలు చొప్పున వేయాలి. గుళికలు వేసిన తర్వాత 3 నుంచి 4 రోజులు చేలో నీరు బయటకు గాని బయట నీరు లోపలికి గానీ రాకుండా చర్యలు తీసుకోవాలి.

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.