close
సోయాలో సస్యరక్షణ

న్యూస్‌టుడే, సదాశినగర్‌

వేసవి పంటగా విత్తిన సోయాలో చీడపీడల నివారణకు చేపట్టాల్సిన సస్యరక్షణ చర్యలను మండల వ్యవసాయాధికారి ప్రజాపతి (చరవాణి: 72888 94609) సూచించారు.


పురుగులు

రసంపీల్చే పురుగులు (పేనుబంక) : వీటి తల్లి, పిల్ల పురుగులు లేత కొమ్మలు, ఆకులు, పూత, కాయల నుండి రసాన్ని పీల్చడం వల్ల మొక్కల పెరుగుదల ఆగుతుంది. ఆకులపై తేనెవంటి జిగురు పదార్థాన్ని ఇవి విసర్జిస్తాయి. నివారణకు లీటరు నీటికి ఫిప్రోనిల్‌ 2 మి.లీ. చొప్పున కలిపి పిచికారీ చేయాలి.

ఆకుముడత పురుగు : ఇది ఆకులను గూడులా చేసుకొని ఆకుల్లోని పత్రహరితాన్ని గోకి తింటాయి. నివారణకు లీటరు నీటికి 1 గ్రాము ఎసిఫేట్‌ లేదా 2.5 మి.లీ. క్లోరిపైరిఫాస్‌ లేదా 2 మి.లీ. క్వినాల్‌ఫాస్‌ కలిపి పిచికారీ చేయాలి.

ఆకుమచ్చ తెగులు : ఇది ఆశించిన ఆకులపై గోధుమరంగు మచ్చలు ఏర్పడతాయి. నివారణకు లీటరు నీటికి 3 గ్రాముల మాంకోజెబ్‌ లేదా 1 గ్రాము కార్బండజిమ్‌ కలిపి అవసరాన్ని బట్టి 10 రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారీ చేయాలి.


తెగుళ్లు

కుంకుమ తెగులు : ఆకులపై గోధుమరంగు మచ్చలు ఏర్పడతాయి. గాలిలో అధిక తేమ, వాతావరణం చల్లగా ఉన్నప్పుడు దీని ఉద్ధృతి పెరుగుతుంది. నివారణకు లీటరు నీటికి 3 గ్రాముల మాంకోజెబ్‌ + 1 మి.లీ. కెరాథేన్‌ కలిపి వారం వ్యవధిలో అవసరాన్ని బట్టి 2-3 సార్లు పిచికారీ చేయాలి.
మొవ్వుకుళ్ళు తెగులు : ఇది తామర పురుగుల ద్వారా వ్యాపిస్తుంది. తెగులు సోకిన మొక్కలు మొవ్వు నుంచి ఎండుతాయి. తెగులును తట్టుకునే జె.యస్‌-335, పి.కె-472, పి.కె-1029 రకాలను సాగు చేయాలి.

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.