close
పశువుల్లో కృత్రిమ గర్భధారణ

పాడి పశువుల పెంపకంలో ఏడాదికి ఒక దూడ పుట్టేలా రైతులు చర్యలు చేపడితే.. పాడి లాభసాటిగా ఉంటుంది. అధిక పాల ఉత్పత్తి, పశువు ఆరోగ్యం, పాడి ద్వారా ఆదాయం మెరుగుపరచాలనే ఉద్దేశంతో సుమారు 20 ఏళ్ళ క్రితం పశుగణాభివృద్ధి సంస్థ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 1289 మంది గోపాలమిత్రలను నియమించారు. రాష్ట్రంలో సుమారు 38.55 లక్షల పశువులున్నాయి. 7.65 లక్షల పశువులకు వీరు కృత్రిమ గర్భధారణ సేవలను అందిస్తున్నారు. ప్రస్తుతం కరీంనగర్‌లో మాత్రమే ఘనీకృత వీర్య సేకరణ కేంద్రం ఉంది. మహబూబ్‌నగర్‌ జిల్లాలోని కంసానిపల్లెలో మరో కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నారు.

అధిక ప్రయోజనాలు
* మేలుజాతి పోతులు, ఎద్దుల పోషణకు అధిక ఖర్చవుతుంది. కృత్రిమ గర్భధారణ పద్ధతిలో తక్కువ ఖర్చుతోనే మెరుగైన ఫలితాలను పొందవచ్చు. ఒక్కో పోతు నుంచి లభించే ఎంతో విలువైన వీర్యాన్ని ఎక్కువ పశువులకు గర్భధారణలో వినియోగించవచ్చు.
* పోతుల నుండి నాణ్యమైన వీర్యాన్ని సేకరించడం వల్ల, వ్యాధుల వ్యాప్తిని నివారించవచ్చు.
* సేకరించిన వీర్యం నాణ్యతను పలు దశల్లో పరీక్షిస్తారు. కనుక ఫలదీకరణం విజయవంతమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
* మేలు జాతి పశువుల పునరుత్పత్తికి, అధిక పాల దిగుబడులకు, డెయిరీలో లాభదాయకతకు ఈ విధానం దోహదం చేస్తుంది.

సెక్స్‌ సార్టెడ్‌ వీర్యదానం : ఈ ప్రక్రియ ద్వారా.. కేవలం ఆడదూడలనే పుట్టించి, పాల ఉత్పత్తిని పెంచవచ్చు. పాడి సంతతిని పెంచేందుకు.. పరిమిత ఖర్చు, అధిక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ఐవిఎఫ్‌ లాంటి కొత్త ప్రక్రియలతో రైతులు మేలైన ఫలితాలను పొందవచ్చు.

- మధుసూదనరావు, ఉపసంచాలకులు
విజయ డెయిరీ, కామారెడ్డి

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.