close
మల్చింగ్‌ కవరు పరిచే యంత్రం

న్యూస్‌టుడే, త్రిపురారం (నల్గొండ జిల్లా)

ల్చింగ్‌ కవర్‌ను భూమిలో పరిచే యంత్రం అందుబాటులోకి రావడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆయకట్టేతర ప్రాంతాల్లో.. తక్కువ నీటితో ఎక్కువ విస్తీర్ణంలో కూరగాయలు తదితర ఉద్యాన పంటలను సాగు చేసేందుకు రైతులు మల్చింగ్‌ కవరును ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. సాధారణ పద్ధతిలో.. ముందుగా దుక్కి దున్ని, బోదెలు చేసి, తరువాత కూలీలతో మల్చింగ్‌ కవరును పరిచేందుకు, కవరు అంచులపై మట్టిని ఎగదోసేందుకు ఎక్కువ మంది కూలీల అవసరం ఉంటుంది. ఫలితంగా ఖర్చు పెరుగుతుంది. ఈ పనినే సులువుగా, తక్కువ ఖర్చుతో నిర్వహించేందుకు.. ప్రత్యేక పరికరం అందుబాటులోకి వచ్చింది. ఈ పరికరాన్ని ట్రాక్టర్‌కు అమర్చి, ఇద్దరు కూలీలతో రోజుకు 5 నుంచి 6 ఎకరాల్లో మల్చింగ్‌ కవరును పరచవచ్చు. ఈ పరికరం రైతులకు ఎంతో మేలు చేస్తోంది.

వ్యవసాయంలో కూలీల అందుబాటు సమస్యగా ఉంది. తక్కువ ఖర్చుతో ఎక్కువ విస్తీర్ణంలో పని పూర్తి చేసేందుకు యంత్ర పరికరాలు దోహదపడుతున్నాయి. ఈ పరికరం ఖరీదు రూ.30 వేలు, మహారాష్ట్రలోని పూణెలో (చరవాణి : 9923525575, 9657070802) ఇది లభిస్తోంది.


రాయితీపై ఇవ్వాలి : రాగం శేఖర్‌, రైతు, అన్నారం

సాధారణంగా ఎకరం భూమిలో మల్చింగ్‌ కవర్‌ను పరచాలంటే ఆరు మంది కూలీలు అవసరం. ఈ పరికరంతో ట్రాక్టర్‌ డ్రైవర్‌ కలిపి ముగ్గురితో ఎకరం భూమిలో కవరును పరచవచ్చు. పండ్ల తోటలు, కూరగాయలు సాగుచేసే రైతులకు ఈ పరికరాన్ని రాయితీపై అందిస్తే ఎక్కువ మంది రైతులు ఈ విధానంలో సాగుకు ముందుకు వస్తారు.

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.