close
రొయ్యల్లో వ్యాధులు

న్యూస్‌టుడే, ఉండి

వాతావరణ మార్పులతో రొయ్యల్లో వ్యాప్తి చెందే వ్యాధులు, వాటి నివారణ చర్యలను ఉండి మత్స్య పరిశోధనా స్థానం శాస్త్రవేత్త ఎన్‌.వీరభద్రరావు (సెల్‌: 96039 38318) తెలిపారు.

తెల్లమచ్చల వ్యాధి
ఈ వ్యాధి సోకిన రొయ్యలు అకస్మాత్తుగా మేతలు తినడం తగ్గించి బలహీనపడతాయి. రొయ్య బాహ్య కవచ గుల్లపై తెలుపు రంగులో గుండ్రని మచ్చలు ఏర్పడతాయి. శరీరం, మొప్పలు ఎరుపు లేదా గోధుమ రంగులోకి మారతాయి. చెరువు గట్ల దగ్గరకు వచ్చి రొయ్యలు ఎక్కువగా చనిపోతాయి. ఈ వ్యాధికి చికిత్స లేదు. కాబట్టి పట్టుబడి ఉత్తమ మార్గం.

నల్ల మొప్పల వ్యాధి
చెరువులో సేంద్రియ పదార్థాలు, వృథా అయ్యే మేతల వల్ల అమోనియా, నైట్రేట్‌, హైడ్రోజన్‌ సల్ఫైడ్‌ వంటి విష వాయువులు అధిక గాఢతలో వెలువడుతాయి. ఈ వ్యాధి సోకిన రొయ్యల మొప్పలు క్షీణించి నల్లగా మారతాయి. ఆయా సందర్భాల్లో చెరువులో తగినంత ఆక్సిజన్‌ లేనిపక్షంలో రొయ్యలు చనిపోయే ప్రమాదం ఉంటుంది. నివారణకు మేత వృథాను తగ్గించాలి. పంటల మధ్య కనీసం 2 నెలలు విరామం ఉండాలి. ఒకసారి పట్టుబడి అయిన తరువాత నేల పగుళ్లు వచ్చేవరకు చెరువును ఎండబెట్టాలి. 


వైట్‌గట్‌

ఈ వ్యాధి సోకిన రొయ్యల ఆహార నాళం తెల్లబడుతుంది. వ్యాధి సోకిన రొయ్యలున్న చెరువులో తెల్లని రెట్టలు నీటిపై తేలుతుంటాయి. రొయ్యలు మేతలు సరిగా తీసుకోకపోవడం వల్ల పెరుగుదల ఆగిపోయి చనిపోతాయి.
నివారణకు.. చెరువుల్లో సేంద్రియ పదార్థాలు పేరుకుపోకుండా జాగ్రత్తలు పాటించాలి. పట్టుబడి తరువాత చెరువులో ఒక అంగుళం మేర మట్టి పొరను బ్లేడుతో తొలగించాలి. రొయ్య పిల్లలను నేరుగా ప్రధాన చెరువులో వదలకుండా ముందు 25 రోజులు నర్సరీలో ఉంచి, తరువాత ప్రధాన చెరువులోకి మార్చాలి. 


విబ్రియోసిస్‌ వ్యాధి

లవణీయత (సెలినిటి/ఉప్పు) ఎక్కువగా ఉన్న నీటితో రొయ్యల సాగు చేస్తే.. ఈ వ్యాధి ఎక్కువగా సోకే అవకాశముంది. రొయ్యలకు తోక కొరుకుడు, బొబ్బలు వచ్చి కాలేయం రంగు కూడా మారిపోతుంది. ఈ వ్యాధి సోకిన రొయ్యలు మేతలు తీసుకోవు. ఉదరం ఖాళీగా ఉంటుంది. వ్యాధి ఉధృత దశలో రొయ్యలు మరణించే ప్రమాదముంది. నివారణకు విత్తన కొనుగోలు దశలోనే సరైన జాగ్రత్తలు తీసుకోవాలి.
* బయోసెక్యూరిటీ (క్రాప్‌ ఫెన్సింగ్‌, బర్డ్‌ ఫెన్సింగ్‌) వంటి చర్యలు చేపట్టాలి.

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.