close
పైర్లలో ప్రస్తుత చర్యలు

న్యూస్‌టుడే, జగిత్యాల (వ్యవసాయం)

రైతులు సాగుచేస్తున్న రబీ, వేసంగి పంటలను ఆశిస్తున్న చీడపీడల నివారణకు చేపట్టాల్సిన సస్యరక్షణ చర్యలను జగిత్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం సహ పరిశోధన సంచాలకులు డాక్టర్‌ ఆర్‌.ఉమారెడ్డి సూచించారు.
శనగ : ఈ పంటలో ఎండు తెగులు నివారణకు.. లీటరు నీటికి 3 గ్రా. కాపర్‌ఆక్సీ క్లోరైడ్‌ కలిపిన ద్రావణాన్ని మొక్కల మొదళ్లు తడిచేలా పోయాలి.
* లద్దెపురుగుల నివారణకు.. లీటరు నీటికి థయోడికార్బ్‌ 1 గ్రాము లేదా క్వినాల్‌ఫాస్‌ 2 మి.లీ. లేదా ఎసిఫేట్‌ 1.5 గ్రాము వంతున కలిపి పిచికారి చేయాలి.
కంది : మారూకా మచ్చల పురుగు, శనగపచ్చ పురుగు నివారణకు.. లీటరు నీటికి క్లోరిపైరిఫాస్‌ 2.5 మి.లీ. లేదా నోవాల్యూరాన్‌ 0.75 మి.లీ. పాటు డైక్లోరోవాస్‌ 1 మి.లీ. మందు కలిపి పిచికారి చేయాలి.
* శనగపచ్చ పురుగుల తీవ్రత ఎక్కువున్నప్పుడు.. ఈ పురుగు లార్వాలను పక్షులు ఏరుకుని తినేందుకు వీలుగా.. ఎకరాకు 10-15 పక్షి స్థావరాలను ఏర్పాటు చేయాలి. పురుగు ఉనికిని గమనించేందుక.. ఎకరాకు 4 లింగాకర్శక బుట్టలను అమర్చాలి.
నువ్వు
* పేనుబంక, పచ్చదోమ, తామర పురుగులు, తెల్లనల్లి ఆశించి మొక్కల అన్నిభాగాల నుంచి రసాన్ని పీల్చటం వల్ల ఆకులపై నల్లటి బూజు ఏర్పడుతుంది. నివారణకు.. 10 లీటర్ల నీటికి ఇమిడాక్లోప్రిడ్‌ 3 మి.లీ. లేదా లీటరు నీటికి ఎసిఫేట్‌ 1.5 గ్రాములు లేదా మోనోక్రోటోఫాస్‌ 1.6 మి.లీ. వంతున కలిపి పిచికారి చేయాలి.
* బూడిద తెగులు నివారణకు లీటరు నీటికి 3 గ్రా. నీటిలో కరిగే గంధకం లేదా 1 గ్రాము మైకోబ్యుటానిల్‌ కలిపి పిచికారి చేయాలి.
* ఆకుమచ్చ నివారణకు.. లీటరు నీటికి కార్బండిజం + మాంకోజెబ్‌ కలిసి ఉన్న మందు 2.5 గ్రా., చొప్పున కలిపి పిచికారి చేయాలి.
మిరప


* పైముడత నివారణకు.. లీటరు నీటికి 1.5 గ్రాముల ఎసిఫేట్‌ కలిపి పిచికారి చేయాలి.
* బూడిద తెగులు నివారణకు- లీటరు నీటికి.. నీటిలో కరిగే గంధకం 3 గ్రా. లేదా డైనోకాప్‌ 1 మి.లీ. లేదా అజాక్సిస్ట్రోబిన్‌ 1 మి.లీ. లేదా 10 లీటర్ల నీటికి మైకోబ్యుటానిల్‌ 4 గ్రా. కలిపి పిచికారి చేయాలి.
* తామర పురుగులు, నల్లిని అరికట్టేందుకు.. లీటరు నీటికి డయాఫెన్‌థయురాన్‌ 1.5 గ్రాము లేదా క్లోరోఫెనాఫైర్‌ 2 మి.లీ. కలిపి పిచికారి చేయాలి.
* కాయకుళ్లు తెగులు నివారణకు.. లీటరు నీటికి కాపర్‌ ఆక్సీక్లోరైడ్‌ 3 గ్రా. లేదా ప్రొపికొనజోల్‌ 1 మి.లీ. కలిపి పిచికారి చేయాలి.

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.