close
వేసవికి అనువైన వరి రకాలు

న్యూస్‌టుడే, ఒంటిమిట్ట

 

సాగునీటి వనరులు అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో రైతులు వేసవిలో మూడో పంట (ఎడగారు)గా వరిని ఫిబ్రవరి చివరి వారం నుండి మార్చి ఆఖరు వరకు నారు పోస్తారు. ఎడగారు పంటలో రకాల ఎంపిక కీలకమని ఊటుకూరు ఏరువాక, కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు డాక్టర్‌ ఎ.వీరయ్య (చరవాణి: 99896 23811), సి.ప్రత్యూష, డాక్టర్‌ బి.పద్మోదయ తెలిపారు.
శ్వేత (ఎన్‌ఎల్‌ఎల్‌-40024): పంటకాలం 120 రోజులు. దిగుబడి ఎకరాకు 29 కింటాళ్లు. ఎడగారు కాలానికి అనువైన రకం. అగ్గి తెగులు తట్టుకుంటుంది. బియ్యం మధ్యస్థంగా ఉంటాయి. అధిక ఉష్ణోగ్రతలను కూడా తట్టుకుంటుంది. దక్షిణ మండలంలో ఈ సీజన్‌లో సాగుకు అనువైనది.
నెల్లూరు మషూరి (ఎన్‌ఎల్‌ఆర్‌-34449): పంటకాలం 125 రోజులు. దిగుబడి ఎకరాకు 32 క్వింటాళ్లు. గింజ నాణ్యత బాగుంటుంది. పైరు పడిపోదు. పొట్టి రకం.
నెల్లూరు ధాన్యలక్ష్మి (ఎన్‌ఎల్‌ఆర్‌-3354): పంటకాలం 120-125 రోజులు. ఎడగారు కాలానికి బాగా అనుకూలం. అధిక దిగుబడినిచ్చే సన్న బియ్యం రకం. పైరు పడిపోదు. హెక్టారుకు (రెండున్నర ఎకరాలు) 7-7.5 మెట్రిక్‌ టన్నుల దిగుబడి పొందవచ్చు.
అపరాలు : పెసర, మినుము పంటలను సాగు చేయాలనుకునే రైతులు పల్లాకు తెగులును తట్టుకునే రకాలను ఎంపిక చేయాలి.
పెసరలో.. డబ్ల్యుజిజి-42: పంటకాలం 55-60 రోజులు. ఎకరాకు 4-6 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. పల్లాకు తెగులును బాగా తట్టుకుంటుంది. గింజలు లావుగా, నిగనిగలాడుతాయి.
ఐపీఎం 2-14: పంటకాలం 60-65 రోజులు. ఎకరాకు 4-6 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. పల్లాకు తెగులును తట్టుకోగలదు. మొక్క నిటారుగా పెరుగుతుంది. ఒకేసారి కోతకు వస్తుంది. గింజలు మధ్యస్థ లావుగా ఉంటాయి.
మినుము.. టీబీజీ-104: పంటకాలం 70-75 రోజులు. ఎకరాకు 8-9 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. అన్ని కాలాలకు అనుకూలం. పల్లాకు తెగులును తట్టుకునే పాలిష్‌ రకం.
ఎల్‌బిజీ-787: పంటకాలం 75-80 రోజులు. ఎకరాకు 8-9 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. పల్లాకు తెగులును కొంతవరకు తట్టుకోగలదు. కాండం కణుపుల వద్ద కూడా కాపు వస్తుంది. పాలిష్‌ రకం. గింజ సైజు మధ్యస్థం. అన్ని కాలాలకు అనుకూలం.
వేరుసెనగ.. టాగ్‌-24 రకం: పంటకాలం 90-100 రోజులు. 74 శాతం గింజ, 48 శాతం నూనె కలిగి ఉండే చిన్న గుత్తి రకం. ఎకరాకు 1600-1800 కిలోల దిగుబడి ఇస్తుంది.

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.