close
వరిలో అగ్గి తెగులు

న్యూస్‌టుడే, కౌడిపల్లి : రబీలో రైతులు ఎక్కువ విస్తీర్ణంలో వరి సాగును చేపట్టారు. ఈ పంటను ప్రస్తుతం అగ్గి తెగులు సోకి  నష్టపరుస్తోంది. వాతావరణ మార్పుల కారణంగా తెగులు సోకుతోంది. సకాలంలో గుర్తించి, నివారణ చర్యలు చేపడితే.. పంట నష్టం సంభవించదు. ఈ తెగులును ఆకుమచ్చ దశలోనే నివారించకపోతే మెడవిరుపునకు కారణమై, ఎక్కువ నష్టం కలుగుతుంది. రైతులు ఆచరించాల్సిన సమగ్ర సస్యరక్షణ చర్యలను మెదక్‌ జిల్లా కౌడిపల్లి మండలం తునికి కృషి విజ్ఞాన కేంద్రం (కేవీకే) శాస్త్రవేత్త డాక్టర్‌ రవికుమార్‌ సూచించారు.
తెగులు లక్షణాలు
* నారుమడితోపాటు నాటిన వరిపైరులో తొలిదశలో.. ఆకులపై నూలుకండె ఆకారంలో మచ్చలు ఏర్పడతాయి. అనుకూల వాతావరణంలో ఈ మచ్చలు పెరుగుతాయి. ఇవి ముదురు గోధుమ లేదా నలుపు రంగులో ఉంటాయి. మధ్యభాగం బూడిద లేదా తెలుపు రంగులో ఉంటుంది. క్రమంగా ఈ మచ్చలు ఒకదానితో ఒకటి కలిసిపోయి ఆకులు పాక్షికంగా లేదా పూర్తిగా ఎండిపోతాయి. ఈ తెగులు ఉధృతంగా ఉన్న పొలాన్ని దూరం నుంచి చూస్తే.. కాలినట్టు కనిపిస్తుంది.
* ఈనిక దశలో మెడపై నల్లని మచ్చలు ఏర్పడి, కంకికి పోషకాలు అందవు. మెడలు విరిగి వేలాడుతాయి. గింజలు తాలుగా మారుతాయి. ఈ దశలోని తెగులును మెడ విరుపు తెగులు అంటారు.
* అగ్గి తెగులు కనిపించిన వెంటనే రైతులు నివారణ చర్యలు చేపట్టాలి. పొలంలో, గట్లపై తుంగ, గరిక, ఒడిపిలి వంటివి లేకుండా చూడాలి.  
* నత్రజని ఎరువులను సిఫారసు చేసిన మోతాదులోనే వాడాలి.  ః మొక్కల్లో రోగనిరోధక శక్తిని పెంచేందుకు.. పొటాష్‌ ఎరువులను 10-15 కిలోల వరకు రెండు దఫాలుగా దమ్ములో ఒకసారి, చిరుపొట్ట దశలో మరోసారి వేయాలి. 

* లీటరు నీటికి ట్రైసైక్లోజోల్‌ + మాంకోజెబ్‌ కలిసి ఉన్న మిశ్రమ మందు 2.5 గ్రాములు లేదా ఐసోప్రోథయోలిన్‌ 1.5 మి.లీ. లేదా కాసుగామైసిన్‌ 2.5 మి.లీ., వీటిలో ఏదైనా ఒక మందును వారం వ్యవధిలో రెండుసార్లు పైరుపై పిచికారి చేయాలి.
* పిలకదశలో ఆకులపైన ఏర్పడిన మచ్చలు, మొక్కల కణుపులకు సోకడం వల్ల ఆ భాగం ముదురు గోధుమ రంగుకు లేదా నలుపు రంగుకు మారి కణుపులు కుళ్లిపోతాయి.

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.