close
పనసలో సస్యరక్షణ

 న్యూస్‌టుడే, ఒంటిమిట్ట

పనసలో పూత, పిందె, కాయ దశలో ఆశించే చీడల నివారణకు చేపట్టాల్సిన సస్యరక్షణ చర్యలను సూక్ష్మనీటి సాగు పథకం కడప జిల్లా పథక సంచాలకులు డి.మధుసూదన్‌రెడ్డి (సెల్‌: 79950 87055) తెలిపారు.
కాయతొలిచే పురుగు : సన్నని లద్దె పురుగులు రంధ్రాలు చేసి లోపలికి వెళ్లి గుజ్జును తినడంతో కాయలు కుళ్లి రాలిపోతాయి. ఈ పురుగాశించిన కాయలపై పురుగు విసర్జితాలతో చేసిన గూళ్లు ఉంటాయి.  
నివారణ : కాయలపై రంధ్రాలు, గూళ్లను గమనించిన వెంటనే లీటరు నీటికి.. కార్బరిల్‌ 2.5 గ్రా. లేదా 2 మి.లీ. క్వినాల్‌ఫాస్‌ లేదా క్లోరిపైరిఫాస్‌ కలిపి పిచికారీ చేయాలి.
కాయకుళ్లు : పిందెలు, కాయలపై శిలీంద్రం వల్ల నల్లని మచ్చలు ఏర్పడతాయి. ఇవి క్రమంగా పెరిగి, కాయంతా వ్యాపిస్తాయి. ఫలితంగా పిందెలు, కాయలు కుళ్లి రాలిపోతాయి. కాయలోపలి తొనలు కుళ్లి తినడానికి పనికిరావు. వాతావరణంలో తేమ, వేడి ఎక్కువైనప్పుడు ఈ తెగులు ఉద్ధృతి పెరుగుతుంది. గాలి ద్వారా ఈగలు, పురుగులు, నీటి తుంపర్ల ద్వారా ఒక కాయ నుంచి మరొక కాయకు తెగులు వ్యాపిస్తుంది.  
నివారణ: పిందెలు, కాయలపై నల్లని మచ్చలు కనిపించిన వెంటనే లీటరు నీటికి.. 3 గ్రా. కాపర్‌ ఆక్సిక్లోరైడ్‌ చొప్పున 2 వారాల వ్యవధిలో 2-3 సార్లు పిచికారీ చేయాలి. రాలిన ఆకులను ఏరి కాల్చివేయాలి. కుళ్లిన కాయలను తొలగించాలి. ఈ సమయంలో ఎక్కువ నీటి తడులివ్వకూడదు.

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.