close
వరిలో ఎలుకల నియంత్రణ

న్యూస్‌టుడే, కురుపాం గ్రామీణం'

వరిలో ఎలుకల నియంత్రణకు చేపట్టాల్సిన చర్యలను కురుపాం వ్యవసాయాధికారి ఎ.శివ వివరించారు. గట్లపై కలుపు లేకుండా శుభ్రంగా ఉంచాలి. ఎలుకల నివారణ బుట్టలను నాట్లు వేసిన నెల వరకు, కోతల తర్వాత ఎకరానికి 20 చొప్పున చేల వద్ద అమర్చి.. ఎలుకల వలసను అరికట్టవచ్చు. పంట చిరుపొట్ట దశ ఏర్పడక ముందే నివారణ చర్యలు చేపట్టాలి. ఇందుకోసం వాడాల్సిన మందుల వివరాలు..
బ్రోమడయోలోన్‌ : ఈ ఎరను వాడేటప్పుడు.. ఎలుకలను ముందుగా మచ్చిక చేయనవసరం లేదు. ఈ ఎర తయారీకి 960 గ్రా. నూకలు, 2 గ్రా. నూనె, 2 గ్రా. బ్రోమడయోలోన్‌ (0.05 శాతం) మందు కలిపి 10-15 గ్రా. పొట్లాలుగా కట్టి కన్నంలో ఒకటి చొప్పున సజీవ ఎలుకల బొరియాల్లో లేదా ఎర స్థావరాల్లో.. నాట్లు వేసినప్పటి నుండి పైరు చిరుపొట్ట దశకొచ్చే వరకు పది రోజుల వ్యవధిలో రెండు, మూడుసార్లు వాడవచ్చు.
జింకు ఫాస్ఫైడ్‌ ఎర : ఎలుకలు ఉధృతంగా ఉంటే.. ఈ ఎరను వాడాలి. ముందుగా.. 980 గ్రా. నూకలు, 2 గ్రా. నూనె కలిపి తయారుచేసిన విషం లేని మిశ్రమాన్ని 20 గ్రా. చొప్పున పొట్లాలుగా కట్టి కన్నానికి ఒకటి చెప్పున పెట్టి, రెండు రోజులు ఎలుకలను మచ్చిక చేయాలి. మూడోరోజు జింకు ఫాస్ఫైడ్‌ ఎరను 960 గ్రా. నూకలు, 2 గ్రా. నూనె, 2 గ్రా. జింకు ఫాస్ఫైడ్‌ కలిపి తయారు చేయాలి. ఈ ఎరను 10 గ్రా. పొట్లాలుగా కట్టి కన్నంలో ఒకటి చొప్పున వేయాలి.

ఎర స్థావరాల ఏర్పాటు : బ్రోమడయోలోన్‌ ఎరను.. ఎర స్థావరాల్లో వాడితే అధిక ఫలితం ఉంటుంది. 3 అంగుళాల వ్యాసం, 1.5 అడుగుల పొడవున్న పి.వి.సి. పైపులను ఎకరాకు 5-6 చోట్ల ఎర స్థావరాలుగా పొలానికి నాలుగు మూలల గట్లపై అమర్చాలి. వీటిలో బ్రోమడయోలోన్‌ ఎరమందు 30 గ్రా. చొప్పున ఉంచాలి. వారానికి రెండుసార్లు తాజాగా తయారు చేసిన ఎర మందును మార్చుతుండాలి. ఎర స్థావరాల్లో ఎరను ఉంచడం వల్ల ఎండ, వానలకు పాడవదు. పెంపుడు జంతువులకు, పక్షులకు అందుబాటులో ఉండదు.


పొగ బారించడం..

పంట ఏ దశలోనైనా కన్నాల్లోకి.. కనీసం మూడు నిమిషాల పాటు పొగను వదిలి ఎలుకలను సులువుగా చంపవచ్చు. ఎలుకలు రసాయన ఎరలను ముట్టని సందర్భాల్లో ఈ విధానాన్ని ఉపయోగించవచ్చు. పంట ఈనిక దశలో పొగబారించడం ద్వారా.. ఒకే కన్నంలో వివిధ దశల్లో ఉన్న ఎలుకలను నిర్మూలించి తదుపరి సీజన్లో వాటి ఉధృతిని తగ్గించవచ్చు.
ఎలుకల నివారణకు రైతులు సామూహికంగా పంటలేని సమయంలో చర్యలు చేపడితేనే ఫలితం ఉంటుంది. ఆ సమయంలో ఎలుకలకు కావలసిన ఆహారం తక్కువగా ఉండి, ఎరలను తిని చనిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.