close
వేరుసెనగలో సస్యరక్షణ

న్యూస్‌టుడే, ఒంటిమిట్ట

సాగునీటి వనరులు అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో రైతులు వేసవి పంటగా వేరుసెనగను విస్తారంగా వేశారు. ముందస్తుగా సాగుచేసిన పంటలో పలు రకాల చీడపీడలు ఆశించి నష్టం కలిగిస్తున్నాయి. వీటి నివారణకు చేపట్టాల్సిన సస్యరక్షణ చర్యలను ఊటుకూరు ఏరువాక, కృషి విజ్ఞాన కేంద్రం (కేవీకే) శాస్త్రవేత్తలు డాక్టర్‌ ఎ.వీరయ్య (99896 23811), సి.ప్రత్యూష, డాక్టర్‌ బి.పద్మోదయ సూచించారు.

మొక్కల నుంచి రసం పీల్చే తామర పురుగుల ఉధృతి పైర్లపై కనిపిస్తోంది. ఈ పురుగులు మొవ్వుకుళ్లు, కాండంకుళ్లు వైరస్‌ తెగుళ్లను వ్యాప్తి చేస్తాయి.

మొవ్వుకుళ్లు: ఈ తెగులు లక్షణాలు మొదట లేతాకులపై కన్పిస్తాయి. ఫలితంగా ఆకులపై నిర్జీవ వలయాలు లేక చారలు ఏర్పడుతాయి. మొవ్వు ఎండిపోతుంది. లేత దశలో ఈ తెగులాశిస్తే మొక్కలు గిడసబారి ఎక్కువ రెమ్మలు వస్తాయి. ఆకులు చిన్నవిగా మారి లేతాకుపచ్చ మచ్చలు కలిగి పాలిపోతాయి. లేత దశలో ఆశించిన మొక్కల్లో కాయలు ఏర్పడవు.

కాండం కుళ్లు: లేతాకుల ఈనెలపై నల్లటి మాడు పట్టిన మచ్చలు ఏర్పడుతాయి. తర్వాత ఈ మచ్చలు ఆకు తొడిమ నుంచి కాండంపైకి విస్తరిస్తాయి. మొవ్వు ఎండిపోతుంది. 15 రోజుల్లోపు వయసున్న వైరస్‌ సోకిన మొక్కలను పొలంలో గమనించిన వెంటనే  పీకి కాల్చి వేయాలి.

* తామర పురుగుల నివారణకు లీటరు నీటికి ఫిప్రోనిల్‌ 2 మి.లీ. లేదా డైమిథోయేట్‌ 2 మి.లీ. లేదా ఇమిడాక్లోప్రిడ్‌ 0.4 మి.లీ. చొప్పున కలిపి పిచికారి చేయాలి. పేనుబంక, పచ్చదోమల నివారణకు కూడా ఇవే మందులను వాడవచ్చు.
* పైరు పూత దశలో తామర పురుగుల ఉద్ధృతి ఎక్కువగా ఉంటే.. 10 లీటర్ల నీటికి స్పైనోసాడ్‌ 3 మి.లీ. చొప్పున కలిపి పిచికారి చేయాలి. ఈ మందు మారుకా మచ్చల పురుగును సైతం నివారిస్తుంది.
* ఎకరాలో అక్కడక్కడా 20 చొప్పున పసుపురంగు జిగురు అట్టలను ఉంచి, పైరుపై తెల్లదోమల ఉనికిని, ఉద్ధృతిని అంచనా వేయడంతోపాటు పురుగుల సంతతిని నివారించవచ్చు.
* ఎకరాలో అక్కడక్కడా 20 నీలిరంగు జిగురు అట్టలను ఉంచడం ద్వారా తామర పురుగులను అరికట్టవచ్చు.


తెల్లదోమల నివారణకు..

లీటరు నీటికి ఎసిఫేట్‌ 1 గ్రాము లేదా ప్రొఫినోఫాస్‌ 1.5 మి.లీ. లేదా మోనోక్రొటోఫాస్‌ 1.6 మి.లీ., లేదా 10 లీటర్ల నీటికి ఎసిటామిప్రిడ్‌ 2 గ్రా. లేదా థయోమిథాక్సామ్‌ 2 గ్రా. కలిపి పిచికారి చేయాలి. ఈ పురుగుల ఉద్ధృతి తగ్గకపోతే మందులను మారుస్తూ వారం నుంచి 10 రోజుల వ్యవధిలో పిచికారి చేయాలి.


 

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.