ఏటీపీ ఫైనల్స్‌లో మెద్వెదేవ్‌ vs డొమినిక్‌

తాజా వార్తలు

Published : 22/11/2020 12:08 IST

ఏటీపీ ఫైనల్స్‌లో మెద్వెదేవ్‌ vs డొమినిక్‌

(Photo source ATP tour Twitter)

ఇంటర్నెట్‌డెస్క్‌: లండన్‌లో జరుగుతున్న ఏటీపీ పోటీల్లో డానిల్‌ మెద్వెదేవ్‌, డొమినిక్‌ థీమ్‌ ఫైనల్స్‌ చేరారు. శనివారం జరిగిన సెమీస్‌లో తొలుత డొమినిక్‌ 7-5, 6-7 (10/12), 7-6 (7/5) తేడాతో జకోవిచ్‌ను ఓడించగా తర్వాత మెద్వెదేవ్‌ 3-6, 7-6 (4), 6-3 తేడాతో రఫెల్‌ నాదల్‌ను దెబ్బకొట్టాడు. దీంతో ఇద్దరు దిగ్గజాలు సెమీస్‌ నుంచే ఇంటిముఖం పట్టారు. ‘టెన్నిస్‌ చరిత్రలో ఇద్దరు దిగ్గజ ఆటగాళ్లను మేం ఓడించడం గర్వంగా ఉంది. ఈ ఆటలో ఇది ప్రత్యేకమైన సందర్భం’ అని నాదల్‌ను ఓడించాక మెద్వెదేవ్‌ పేర్కొన్నాడు. ఇక ఈ మ్యాచ్‌ రెండో సెట్‌లో 5-4తో వెనుకబడిన తాను తర్వాత ఆటలో స్వల్ప మార్పులు చేసుకున్నట్లు చెప్పాడు. అలా చేయడంతో తనకు కలిసి వచ్చిందని, దాంతో నాదల్‌ను ఓడించానని మెద్వెదేవ్‌ తెలిపాడు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని