
తాజా వార్తలు
రాహుల్, ఫించ్ మధ్య సరదా ఫైట్
సిడ్నీ: టీమిండియా ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో ఉంది. లాక్డౌన్ కారణంగా దాదాపు 9 నెలల తర్వాత భారత్ ఒక సిరీస్‌లో పాల్గొంటోంది. ఈనెల 27న జరిగిన మొదటి వన్డేలో ఆసీస్ జట్టు భారత్‌ను చిత్తుగా ఓడించింది. మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా ఓపెనర్లు, అరోన్ ఫించ్, డేవిడ్ వార్నర్ సహా కెప్టెన్ స్మిత్, గ్లెన్ మాక్స్వెల్ చెలరేగి ఆడటంతో ఆ జట్టు 374 పరుగులు చేసింది. ఆసీస్ నిర్దేశించిన భారీ స్కోరును భారత్ ఛేదించలేకపోయింది. 50 ఓవర్లలో 308 పరుగులు మాత్రమే చేయగలిగింది.
సిడ్నీ వేదికగా ఆదివారం రెండో వన్డే జరిగింది. టాస్ గెలిచిన ఆసీస్ జట్టు మొదట బ్యాటింగ్‌కు దిగింది. అయితే ఈ మ్యాచ్ సందర్భంగా ఆసీస్ ఓపెనర్ అరోన్ ఫించ్, భారత వికెట్ కీపర్ కేఎల్ రాహుల్ మధ్య సరదా సన్నివేశం చోటుచేసుకుంది. నవదీప్ సైని వేసిన 12వ ఓవర్లో బంతి నేరుగా వెళ్లి ఫించ్ పొట్టకు తాకింది. స్వల్ప నొప్పితో ఫించ్ పొట్ట పట్టుకోగా వెనకనుంచి వెళ్లిన రాహుల్.. ఫించ్ ఉదర భాగంలో తడిమేందుకు ప్రయత్నించాడు. దీంతో ఆసీస్ ఓపెనర్ రాహుల్ పొట్టపై చిన్న పంచ్ ఇవ్వడంతో వారిద్దరి మధ్య నవ్వులు పూశాయి. అది చూసిన ప్రేక్షకులు సైతం నవ్వుకున్నారు.
స్పోర్ట్స్
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
చిత్ర వార్తలు
సినిమా
- సారీ బ్రదర్ నిన్ను కాదు పొడవాల్సింది
- సైఫ్ అలీఖాన్ ఇంటి వద్ద భద్రత కట్టుదిట్టం
- చరిత్రలో నిలిచే పోరాటమిది: గావస్కర్
- కాస్త బంతిని చూడవయ్యా సుందరం: వీడియో వైరల్
- హైదరాబాద్ కేపీహెచ్బీలో దారుణం
- ప్చ్.. ఆధిపత్యానికి వరుణుడు బ్రేక్!
- పాచిపెంట ఎస్సైపై యువకుల దాడి
- కమల వండితే.. అమెరికా ఆహా అంది
- సిరాజ్.. ఇక కుర్రాడు కాదు
- వారెవ్వా సిరాజ్..ఒకే ఓవర్లో రెండు వికెట్లు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
