భారత్×ఆసీస్‌ తొలి టెస్టుకు కరోనా ఎఫెక్ట్‌?

తాజా వార్తలు

Updated : 16/11/2020 12:24 IST

భారత్×ఆసీస్‌ తొలి టెస్టుకు కరోనా ఎఫెక్ట్‌?

స్వీయ నిర్భందంలో కొందరు ఆస్ట్రేలియా ఆటగాళ్లు

ఇంటర్నెట్‌డెస్క్:  ఆస్ట్రేలియా టెస్టు సారథి టిమ్‌ పైన్‌తో సహా కొందరు ఆసీస్‌ టెస్టు జట్టు సభ్యులు స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు. దక్షిణ ఆస్ట్రేలియాలో కరోనా వ్యాపిస్తుండటంతో వైద్యాధికారుల సూచనల మేరకు ఐసోలేషన్‌లో ఉన్నారు. ఇటీవల దక్షిణా ఆస్ట్రేలియాలో జరిగిన షీఫెల్డ్‌ షీల్డ్‌ టోర్నీలో టిమ్‌ పైన్‌, మాథ్యూ హెడ్‌, ఇతర టెస్టు జట్టు ఆటగాళ్లు టాస్మానియా టైగర్స్‌ జట్టు తరఫున ప్రాతినిధ్యం వహించారు. అయితే అక్కడ కరోనా వ్యాప్తి పెరగడంతో టాస్మానియాకి తిరిగొచ్చినప్పటికీ సెల్ఫ్‌ ఐసోలేషన్‌లో ఉండాల్సిందేనని అధికారులు సూచించారు. ఆటగాళ్లకి కరోనా పరీక్షలు నిర్వహించనున్నారు.

అయితే, దక్షిణ ఆస్ట్రేలియాలోని అడిలైడ్‌లో కరోనా తీవ్రత ఉండటంతో భారత్×ఆసీస్‌ తొలి టెస్టుకు అడ్డంకులు ఏర్పడతాయనే అనుమానాలు మొదలయ్యాయి. కాగా, షెడ్యూల్‌ ప్రకారమే టెస్టు జరుగుతుందని ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు ప్రతినిధి ఒకరు తెలిపారు. పరిస్థితుల్ని పర్యవేక్షిస్తున్నామని, అన్నీ నియంత్రణలోకి వస్తాయన్నారు. ఐపీఎల్‌ ముగిసిన తర్వాత భారత ఆటగాళ్లు సిడ్నీకి చేరుకున్న సంగతి తెలిసిందే. 14 రోజుల పాటు నిబంధనలను పాటిస్తూ సాధన మొదలుపెట్టారు. నవంబర్‌ 27న ప్రారంభమై జనవరి 27న ముగిసే ఆస్ట్రేలియా పర్యటనలో భారత్‌ మూడు వన్డేలు, మూడు టీ20లు, నాలుగు టెస్టులు ఆడనుంది. డిసెంబర్‌ 17న అడిలైడ్‌ వేదికగా తొలి డే/నైట్‌ టెస్టు జరగనుంది. అయితే, సిడ్నీలో కరోనా తీవ్రత లేకపోవడంతో పరిమిత ఓవర్ల మ్యాచ్‌లకు ఎటువంటి ఇబ్బందులు లేవు. తొలి రెండు వన్డేలు, ఆఖరి రెండు టీ20లు సిడ్నీ వేదికగా, రెండో వన్డే, మొదటి టీ20 మ్యాచ్ కాన్‌బెర్రాలో జరగనున్నాయి.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని