
తాజా వార్తలు
భారత్‌తో అంటే ఇలానే ఆడాలి: స్మిత్
ఇంటర్నెట్‌డెస్క్: టీమిండియాపై పైచేయి సాధించాలంటే భారీ స్కోర్లు తప్పక చేయాలని ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్ స్టీవ్ స్మిత్ అన్నాడు. సిడ్నీ వేదికగా జరిగిన రెండో వన్డేలో భారత్‌పై ఆసీస్ 51 పరుగుల తేడాతో గెలిచిన సంగతి తెలిసిందే. తొలుత ఆస్ట్రేలియా 389/4 స్కోరు చేయగా భారత్ 338 పరుగులకు తొమ్మిది వికెట్లు కోల్పోయి ఓటమిపాలైంది. కాగా, విజయంలో కీలకపాత్ర పోషించిన స్మిత్ (104; 64 బంతుల్లో)కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు లభించింది. ఈ సందర్భంగా మ్యాచ్ అనంతరం తన ప్రదర్శనపై అతడు మాట్లాడాడు.
‘‘ఎదుర్కొన్న తొలి బంతి నుంచే మంచి టచ్‌లో ఉన్నట్లు అనిపించింది. ఫించ్, వార్నర్ ఇచ్చిన ఘనమైన ఆరంభం వల్లే నేను, మాక్సీ గొప్పగా ఆడాం. పరిస్థితులకు తగ్గట్లుగా ఆడటమే మా ముందు ఉన్న పని. అయితే భారత్‌కు వ్యతిరేకంగా ఆడినప్పుడు కచ్చితంగా భారీ స్కోర్లు సాధించాలి. అలా చేస్తేనే మ్యాచ్‌లో పైచేయి సాధించగలం. అదృష్టవశాత్తు గత రెండు మ్యాచ్‌ల్లోనూ మేం ఇలానే చేశాం’’ అని స్మిత్ తెలిపాడు. తొలి వన్డేలో ఆసీస్ 374 పరుగులు చేయగా, రెండో వన్డేలో 389 పరుగులు చేసింది.
ఆసీస్ తరఫున వరుసగా రెండు శతకాలు సాధించిన స్మిత్ ఐపీఎల్లో ఆశించిన స్థాయిలో రాణించని సంగతి తెలిసిందే. దీనిపై మాట్లాడుతూ.. ‘‘ఐపీఎల్లో భారీ షాట్లు ఆడటానికి ప్రయత్నించా. ఇప్పుడు మరింత ఫిట్నెస్ సాధించి ఆడుతున్నా. ఇది ప్రయోజనకరంగా ఉంది. కేవలం క్రికెటింగ్ షాట్లే ఆడుతున్నా. రికార్డుల గురించి పట్టించుకోవట్లేదు. జట్టు కోసం పరుగులు చేయడం సంతోషంగా ఉంది. మా జట్టు ఆటగాళ్లందరూ గొప్పగా ఆడుతున్నారు’’ అని స్మిత్ పేర్కొన్నాడు. టీమిండియాపై స్మిత్ గత ఐదు ఇన్నింగ్స్‌లో 69, 98, 131, 105, 104 పరుగులు చేశాడు.
స్పోర్ట్స్
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
చిత్ర వార్తలు
సినిమా
- ఆ ఓటమి కన్నా ఈ డ్రా మరింత ఘోరం
- హైదరాబాద్ కేపీహెచ్బీలో దారుణం
- బాయ్‌ఫ్రెండ్ ఫొటో పంచుకున్న కాజల్
- కన్న కూతురిపై ఏడేళ్లుగా అత్యాచారం
- కొత్త అధ్యక్షుడి తీరని కోరిక!
- భీమవరం మర్యాదా.. మజాకా..!
- కూలీలపైకి దూసుకెళ్లిన లారీ..15 మంది మృతి
- చీరకట్టుతో కమలా హారిస్ ప్రమాణ స్వీకారం?
- ఆఖరి రోజు ఓపిక పడితే..!
- భద్రతా సిబ్బంది నుంచే ముప్పు!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
