
తాజా వార్తలు
రహానె..దాని వల్ల ఉపయోగమేంటి: ధావన్
ఇంటర్నెట్‌డెస్క్: సిడ్నీలో క్వారంటైన్ నిబంధనలు పాటిస్తూ భారత ఆటగాళ్లు ఆస్ట్రేలియా పర్యటనకు సన్నద్ధమవుతున్నారు. సాధనలో భాగంగా నెట్ సెషన్లతో పాటు ప్రాక్టీస్ మ్యాచ్‌లు కూడా ఆడుతున్నారు. అయితే నెట్ సెషన్‌కు విరామం లభించినా తన మనసంతా బ్యాటింగ్‌పైనే ఉందని సీనియర్ బ్యాట్స్‌మన్ అజింక్య రహానె ఇన్‌స్టాగ్రామ్‌లో తెలిపాడు. తలుపుకి బంతిని విసరగా.. అది తిరిగి వచ్చినప్పుడు బ్యాట్‌తో ప్రాక్టీస్ చేస్తున్న వీడియోను పోస్ట్ చేశాడు. ‘‘నెట్స్‌కు దూరంగా ఉండటంతో నేను ప్రాక్టీస్‌కు మరో మార్గం వెతుకున్నా. బ్యాటును విడిచి ఎక్కువసేపు ఉండలేను. సహచరులు మన్నించాలి’’ అని వీడియోకి రహానె వ్యాఖ్య జత చేశాడు.
అయితే రహానె పోస్ట్‌కు ఓపెనర్ శిఖర్ ధావన్ కామెంట్ చేశాడు. ‘‘భాయ్.. నిన్ననే మనం ప్రాక్టీస్ మ్యాచ్ ఆడాం. అందులో మీరు 50 పరుగులు సాధించారు. ఇప్పుడు ఈ ప్రాక్టీస్ వల్ల ఏం ప్రయోజనం?’’ అని సరదాగా కామెంట్ పెట్టాడు. క్వారంటైన్ కఠిన నిబంధనల్లో సేద తీరడానికి భారత ఆటగాళ్లు ఇలా సామాజిక మాధ్యమాల్లో చురుకుగా ఉంటున్న సంగతి తెలిసిందే. కాగా, నవంబర్ 27 నుంచి ప్రారంభం కానున్న ఆస్ట్రేలియా సుదీర్ఘ పర్యటనలో టీమిండియా మూడు వన్డేలు, మూడు టీ20లు, నాలుగు టెస్టులు ఆడనుంది. సిడ్నీ వేదికగా తొలి వన్డే జరగనుంది.
స్పోర్ట్స్
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
చిత్ర వార్తలు
సినిమా
- 2-1 కాదు 2-0!
- బైడెన్.. హారిస్ సీక్రెట్ కోడ్ పేర్లు ఏంటంటే..!
- వైట్‌హౌస్‌లో విచిత్ర పెంపుడు జంతువులు!
- మీ పెద్దొళ్లున్నారే... :సెహ్వాగ్
- ఇక చాలు
- తీరని లోటు మిగిల్చిన ఓటమి: వార్న్
- ఐపీఎల్ 2021: ఏ జట్టులో ఎవరున్నారంటే..
- సాహో భారత్!
- అందరివాడిని
- భారత్-ఎ జట్టుతో వాళ్లు గెలిచారు: పాంటింగ్
ఎక్కువ మంది చదివినవి (Most Read)
