అది టెస్టు సిరీస్‌పై ప్రభావం చూపుతుంది..

తాజా వార్తలు

Published : 08/12/2020 10:26 IST

అది టెస్టు సిరీస్‌పై ప్రభావం చూపుతుంది..

ఇంటర్నెట్‌డెస్క్‌: ఆస్ట్రేలియాతో జరుగుతున్న టీ20 సిరీస్‌లో విజయం సాధించడం రాబోయే టెస్టు సిరీస్‌పై ప్రభావం చూపుతుందని మాజీ పేసర్‌ ఆశిష్‌ నెహ్రా అన్నాడు. తొలి రెండు వన్డేల్లో ఓటమిపాలైన టీమ్‌ఇండియా తర్వాత అనూహ్యంగా పుంజుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే పొట్టి సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఇదే విషయంపై మాజీ పేసర్‌ ఓ క్రీడాఛానల్‌తో మాట్లాడుతూ ఇలా పేర్కొన్నాడు. 50 ఓవర్ల ఫార్మాట్‌లో కంగారూలు భారీ స్కోర్లు చేశారని, అదే క్రమంలో టీమ్‌ఇండియా పొట్టి క్రికెట్‌లో విజయం సాధించిందని చెప్పాడు. ఈ ఫలితం బోర్డర్‌-గావస్కర్‌ ట్రోఫీపై ప్రభావం చూపుతుందని నెహ్రా పేర్కొన్నాడు. ఈ రెండు సిరీసుల్లో కొందరు వేర్వేరు ఆటగాళ్లు ఉన్నారని, అయినా ఈ ఫలితం వారిపై మానసికంగా ప్రభావం చూపుతుందని వివరించాడు. 

మరోవైపు రెండో టీ20లో ధారాళంగా పరుగులిచ్చిన బౌలర్లపై స్పందించిన నెహ్రా మూడో టీ20లో వారిని తీసేయాల్సిన అవసరం లేదన్నాడు. నటరాజన్‌ మినహా వాషింగ్టన్‌ సుందర్‌, దీపక్‌ చాహర్‌, శార్దూల్‌ ఠాకుర్‌, యుజువేంద్ర చాహల్‌ 8కిపై ఎకానమీతో పరుగులిచ్చారు. ఈ మ్యాచ్‌లో కెప్టెన్‌ కోహ్లీకి విశ్రాంతినిచ్చి మనీష్‌ పాండేను తీసుకునే వీలుందని మాజీ పేసర్‌ అభిప్రాయపడ్డాడు. ఈ ఒక్క మార్పు తప్పితే ఏదీ ఉండదని పేర్కొన్నాడు. కోహ్లీ గైర్హాజరీలో కేఎల్‌ రాహుల్‌ జట్టును నడిపిస్తాడని నెహ్రా ఆశాభావం వ్యక్తం చేశాడు. ఇదిలా ఉండగా, టీమ్‌ఇండియా ఇప్పటికే రెండు టీ20లు గెలిచి పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉంది. ఈ మ్యాచ్‌లోనూ విజయం సాధించి మానసికంగా టెస్టు సిరీస్‌కు సన్నద్ధమవ్వాలని భావిస్తోంది. మరోవైపు ఆస్ట్రేలియా ఈ మ్యాచ్‌లోనైనా గెలవాలని చూస్తోంది. 

ఇవీ చదవండి..

ఒక్క కిడ్నీతో ఒలింపిక్స్‌ వరకూ

అదే ఊపులో.. ఇంకోటి..!


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని