close
Array ( ) 1

తాజా వార్తలు

ఆసీస్‌ లక్ష్యం 133

రాణించిన దీప్తి శర్మ

సిడ్నీ: దీప్తి శర్మ (49*, 46 బంతుల్లో; 3×4) రాణించడంతో ఆస్ట్రేలియాకు భారత్‌ 133 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. మహిళా టీ20 ప్రపంచకప్‌లో భాగంగా సిడ్నీ వేదికగా ఆసీస్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్‌ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 132 పరుగులు చేసింది. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు శుభారంభం దక్కింది. స్మృతి మంధాన (10, 11 బంతుల్లో; 2×4)తో కలిసి ఇన్నింగ్స్‌ ఆరంభించిన షెఫాలి వర్మ (29, 15 బంతుల్లో; 5×4, 1×6) మెరుపు వేగంతో బ్యాటింగ్‌ చేసింది. ఫోర్లు, సిక్సర్లతో అలరించింది. దీంతో నాలుగు ఓవర్లకు 40/0. ఈ జోరుని చూస్తే భారత్‌ భారీ స్కోరు సాధించడం ఖాయమనిపించింది.

కానీ, ఆసీస్‌ స్పిన్నర్‌ జొనస్సెన్‌ (2/24) ధాటికి పరిస్థితి మారిపోయింది. 6.4 ఓవర్లకు 47/3. స్మృతి, షెఫాలి, హర్మన్‌ప్రీత్‌ (2) వరుసగా పెవిలియన్‌కు చేరారు. ఈ స్థితిలో బ్యాటింగ్‌కు వచ్చిన దీప్తి శర్మతో కలిసి జెమిమా రోడ్రిగ్స్‌ (26, 33 బంతుల్లో) ఇన్నింగ్స్‌ను చక్కదిద్దింది. వీరిద్దరూ జాగ్రత్తగా ఆడుతూ పరుగులు రాబట్టారు. దూకుడుగా ఆడే క్రమంలో జెమీమా పెవిలియన్‌కు చేరినా వేదా (9*, 11 బంతుల్లో)తో కలిసి దీప్తిశర్మ పోరాడింది. అయితే ఆఖర్లో భారత బ్యాటర్లు దూకుడుగా ఆడలేకపోవడంతో భారత్‌ 132 పరుగులకే పరిమితమైంది ఆసీస్‌ బౌలర్లలో జోనస్సెన్ రెండు, ఎలిసీ పెర్రీ, డెలిస్సా చెరో వికెట్‌ పడగొట్టారు.


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.