close

తాజా వార్తలు

భారత్‌ లక్ష్యం 287

బెంగళూరు: టీమిండియాతో జరుగుతున్న మూడో నిర్ణయాత్మక వన్డేలో టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 286 పరుగులు చేసింది. స్టీవ్‌స్మిత్‌(131; 132 బంతుల్లో 14x4, 1x6), మార్నస్‌ లబుషేన్‌(54; 64 బంతుల్లో 5x4) రాణించడంతో ఆ జట్టు టీమిండియా ముందు 287 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. ఓపెనర్లు డేవిడ్‌ వార్నర్‌(3), ఆరోన్‌ఫించ్‌(19) త్వరగా ఔటైనా.. స్మిత్‌, లబుషేన్‌ ఆసీస్‌ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. వీరిద్దరూ మూడో వికెట్‌కు 127 పరుగుల భాగస్వామ్యం జోడించారు. ఈ క్రమంలో లబుషేన్‌ వన్డేల్లో తొలి అర్ధ శతకం సాధించాక జడేజా బౌలింగ్‌లో ఔటయ్యాడు.  అదే ఓవర్‌లో మిచెల్‌ స్టార్క్‌(0) సైతం భారీ షాట్‌కు యత్నించి చాహల్‌ చేతికి చిక్కాడు. తర్వాత ఆలెక్స్‌కారే(35; 36 బంతుల్లో 6x4), స్టీవ్‌స్మిత్‌ ధాటిగా ఆడి మరో విలువైన భాగస్వామ్యం నిర్మించారు. చివర్లో భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేసి వరుస వికెట్లు తీశారు. స్మిత్‌.. షమి వేసిన 48వ ఓవర్‌ తొలి బంతికి భారీ షాట్‌ ఆడి శ్రేయస్‌ అయ్యర్‌ చేతికి చిక్కాడు. తర్వాత ఆసీస్‌ బ్యాట్స్‌మెన్‌ పెద్దగా రాణించలేకపోయారు. భారత బౌలర్లలో షమి నాలుగు, జడేజా రెండు వికెట్లు తీశారు. నవ్‌దీప్‌ సైని, కుల్‌దీప్‌ యాదవ్‌ చెరో వికెట్‌ పడగొట్టారు. 


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.