close

తాజా వార్తలు

Updated : 29/11/2020 08:56 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న ఆస్ట్రేలియా

సిడ్నీ: భారత్‌xఆస్ట్రేలియా జట్ల మధ్య మరో ఆసక్తికరపోరుకు రంగం సిద్ధమైంది. ఇప్పటికే తొలి వన్డేలో విజయం సాధించిన ఆరోన్‌ ఫించ్‌ టీమ్‌ ఈ మ్యాచ్‌లోనూ విజయం సాధించి సిరీస్‌ సొంతం చేసుకోవాలని చూస్తోంది. ఈ క్రమంలోనే మరికాసేపట్లో ప్రారంభమయ్యే రెండో వన్డేలో టాస్‌ గెలిచిన ఫించ్‌ మరోసారి బ్యాటింగ్‌ ఎంచుకున్నాడు. అయితే, తొలి వన్డేకు ప్రతీకారంగా కోహ్లీసేన ఈరోజు గెలుపొందాలని భావిస్తోంది. ఒకవేళ టీమ్‌ఇండియా గెలిస్తే సిరీస్ సమంగా మారుతుంది. ఓడితే ఆసీస్‌ సిరీస్‌ గెలుపొందుతుంది. ఈ నేపథ్యంలో కోహ్లీసేన ఎలా ఆడనుందో వేచి చూడాలి.‌

భారత జట్టు: శిఖర్‌ ధావన్‌, మయాంక్‌ అగర్వాల్‌, విరాట్‌ కోహ్లీ (కెప్టెన్‌), శ్రేయస్‌ అయ్యర్‌, కేఎల్‌ రాహుల్‌, హార్దిక్‌ పాండ్య, రవీంద్ర జడేజా, చాహల్‌, మహ్మద్‌ షమి, జస్ప్రీత్‌ బుమ్రా, నవ్‌దీప్‌ సైని

ఆస్ట్రేలియా జట్టు: డేవిడ్‌ వార్నర్‌, ఆరోన్‌ ఫించ్‌(కెప్టెన్‌), స్టీవ్‌స్మిత్‌, గ్లెన్‌మాక్స్‌వెల్‌, హెన్రిక్స్‌, మార్నస్‌ లబుషేన్‌, ఆలెక్స్‌ క్యారీ, జోష్‌ హాజిల్‌వుడ్‌, మిచెల్‌స్టార్క్‌, పాట్‌ కమిన్స్‌, ఆడం జంపా


Tags :

స్పోర్ట్స్

జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని