కోహ్లీనే అత్యుత్తమ ఆటగాడు: గ్రెగ్‌ ఛాపెల్‌

తాజా వార్తలు

Published : 12/12/2020 08:08 IST

కోహ్లీనే అత్యుత్తమ ఆటగాడు: గ్రెగ్‌ ఛాపెల్‌

అడిలైడ్‌: టీమ్‌ఇండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లిలో తమ దేశ ఆటగాళ్ల లక్షణాలు మెండుగా ఉంటాయని ఆస్ట్రేలియా మాజీ సారథి, భారత మాజీ కోచ్‌ గ్రెగ్‌ ఛాపెల్‌ అన్నాడు. తన దూకుడుతో టెస్టు ఫార్మాట్‌కు రక్షకుడిగా నిలుస్తున్న అత్యంత ముఖ్యమైన క్రికెటర్‌ కోహ్లి అని ఛాపెల్‌ తెలిపాడు. ‘‘గతంలో భారత జట్లు గాంధేయ సూత్రాన్ని పాటించేవి. అవసరం లేకపోయినా ప్రత్యర్థి జట్లతో గౌరవపూర్వకంగా ఆడేవి. ఈ దృక్పథాన్ని మార్చిన మొట్టమొదటి కెప్టెన్‌ సౌరభ్‌ గంగూలీ. భారత్‌లో ఇది పని చేసింది. విదేశాల్లో ఫలితాల్ని ఇవ్వలేదు. విరాట్‌ కోహ్లి పూర్తిగా భిన్నం. దూకుడుకు ప్రతినిధి. ప్రత్యర్థిపై సంపూర్ణ ఆధిపత్యం చలాయించాలన్నది అతడి ఆలోచన. క్రికెట్‌ చరిత్రలోనే కోహ్లి అత్యుత్తమ ఆస్ట్రేలియన్‌ కాని ఆస్ట్రేలియన్‌ ఆటగాడు. సరికొత్త టీమ్‌ఇండియాకు ఉదాహరణ. అత్యంత విలువైన ఆటగాడిగా.. క్రికెట్లో శక్తిమంతమైన జట్టుకు సారథిగా ఆట ఆదరణ కోసం బాధ్యతగా కృషి చేస్తున్నాడు. కోహ్లికి ఎల్లప్పుడూ టెస్టు క్రికెటే అత్యున్నతమైనది. కోహ్లి మరింత ఫిట్‌గా.. బలంగా ఉండటానికి టెస్టు క్రికెట్‌ దోహద పడుతుంది’’ అని ఛాపెల్‌ వివరించాడు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని