close

తాజా వార్తలు

Published : 03/12/2020 23:58 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

బిగ్‌బాష్‌ లీగ్‌ నుంచి వైదొలిగిన బెయిర్‌స్టో 

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఇంగ్లాండ్‌ వికెట్‌ కీపర్‌, బ్యాట్స్‌మన్‌ జానీ బెయిర్‌స్టో ఆస్ట్రేలియా బిగ్‌బాష్‌ లీగ్‌ నుంచి వైదొలిగాడు. వచ్చే జనవరిలో శ్రీలంక-ఇంగ్లాండ్‌ మధ్య టెస్ట్‌ సిరీస్‌ జరగనుంది. ఈ నేపథ్యంలో బెయిర్‌స్టో జట్టుకు దూరమవుతున్నట్లు మెల్‌బోర్న్‌ స్టార్స్ యాజమాన్యం ప్రకటించింది. కాగా.. ఈనెల 10న బిగ్‌బాష్‌ లీగ్ పదో సీజన్‌ ప్రారంభం కానుంది. ఈ స్టార్‌ బ్యాట్స్‌మన్‌ స్థానంలో వెస్టిండీస్‌ కీపర్‌, బ్యాట్స్‌మన్‌ ఆండ్రీ ఫ్లెచర్ జట్టులోకి వచ్చాడు.  ఈ విషయాన్ని ఆ జట్టు కోచ్‌ డేవిడ్‌ హస్సీ తెలిపాడు. ప్రస్తుతం బైయిర్‌స్టో దక్షణాఫ్రికాతో జరుగుతున్న టీ20, వన్డే జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. అయితే.. శ్రీలంక సిరీస్‌ కోసం తమ టెస్ట్ జట్టును ఇంగ్లాండ్ ఇంకా ప్రకటించాల్సి ఉంది. 2019 తర్వాత బెయిర్‌స్టో ఈ ఏడాది ఒక్క టెస్ట్ కూడా ఆడలేదు.  గతేడాది లంకతో జరిగిన టెస్ట్ సిరీస్‌లో బెయిర్‌స్టో సెంచరీ చేశాడు.

ప్రస్తుతం దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్‌లో బెయిర్‌స్టో రాణించాడు. మొదటి మ్యాచ్‌లోనే 86 పరుగులు చేశాడు. కాగా.. రేపటి నుంచి ఇంగ్లాండ్‌-దక్షిణాఫ్రికా మధ్య మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ ప్రారంభంకానుంది. ఇటీవల ముగిసిన ఐపీఎల్‌ సీజన్‌-13లో బెయిర్‌స్టో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు ప్రాతినిధ్యం వహించిన విషయం తెలిసిందే.


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

చిత్ర వార్తలు

సినిమా
మరిన్ని

దేవతార్చన