close

తాజా వార్తలు

Published : 22/10/2020 01:19 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

సిరాజ్‌ అదుర్స్‌.. కోల్‌కతా బెదుర్స్‌

ఇంటర్నెట్‌డెస్క్‌: ఆల్‌రౌండర్‌ ప్రదర్శనతో కోహ్లీసేన మరోసారి అదరగొట్టింది. అబుదాబి వేదికగా కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు ఎనిమిది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన కోల్‌కతా.. సిరాజ్‌ (3/8) ధాటికి నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లకు 84 పరుగులే చేసింది. ఇయాన్ మోర్గాన్ (30; 34 బంతుల్లో, 1×4, 1×6) టాప్‌ స్కోరర్‌. అనంతరం బరిలోకి దిగిన బెంగళూరు రెండు వికెట్లు కోల్పోయి 13.3 ఓవర్లలోనే స్వల్ప లక్ష్యాన్ని సునాయసంగా ఛేదించింది. ఈ విజయంతో బెంగళూరు పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి ఎగబాకి ప్లేఆఫ్‌కు చేరువైంది. ఉత్తమ ప్రదర్శన చేసిన సిరాజ్‌కు మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ లభించింది.   

స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన బెంగళూరుకు శుభారంభం దక్కింది. దేవదల్‌ పడిక్కల్‌ (25; 17 బంతుల్లో, 3×4), ఆరోన్‌ ఫించ్‌ (16; 21 బంతుల్లో, 2×4) తొలి వికెట్‌కు 46 పరుగులు జోడించారు. అయితే ఫెర్గూసన్‌ వేసిన 7వ ఓవర్‌లో వీరిద్దరు పెవిలియన్‌కు చేరారు. ఫించ్‌ను ఫెర్గూసన్‌ బోల్తాకొట్టించగా, పడిక్కల్‌ రనౌటయ్యాడు. దీంతో రెండు బంతుల వ్యవధిలోనే బెంగళూరు ఓపెనర్లను కోల్పోయింది. ఈ దశలో బ్యాటింగ్‌కు వచ్చిన గుర్‌కీరత్‌ సింగ్‌ (21*; 26 బంతుల్లో, 4×4), విరాట్ కోహ్లీ (18*; 17 బంతుల్లో, 2×4) మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడి జట్టుకు విజయాన్ని అందించారు. తొలుత నిదానంగా ఆడిన ఈ జోడీ.. తర్వాత గేర్‌ మార్చి బౌండరీలు బాదడంతో 13.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. 

సిరాజ్‌ ... 4-2-8-3

గత మ్యాచ్‌లో భారీగా పరుగులు సమర్పించుకున్న సిరాజ్‌ (3/8)ను జట్టులోకి తీసుకోవడంతో అందరూ కాస్త ఆశ్చర్యానికి లోనయ్యారు. కానీ కెప్టెన్‌ కోహ్లీ నమ్మకాన్ని సిరాజ్‌ నిలబెట్టుకున్నాడు. నిప్పులు చెరిగే బంతులు విసురుతూ ఈ సీజన్‌లో అత్యుత్తమ గణాంకాలు నమోదుచేశాడు. మూడు వికెట్లు పడగొట్టినంత వరకు అతడు ఒక్క పరుగు కూడా ఇవ్వలేదంటే అతడు ఎంతలా బ్యాట్స్‌మెన్‌పై శివాలెత్తాడో తెలుస్తోంది. మరోవైపు సిరాజ్‌కు ఇతర బౌలర్ల నుంచి సహకారం అందడంతో కోల్‌కతా పరిస్థితి దయనీయంగా మారింది.  3/1.. 3/2.. 3/3.. 14/4.. 32/5.. 40/6.. 57/7.. ఇలా వరుసగా కోల్‌కతా బ్యాట్స్‌మెన్‌ పెవిలియన్‌ బాట పట్టారు.  15వ ఓవర్‌లో ఆ జట్టు స్కోరు 50 పరుగులు దాటింది. ఆఖర్లో ఫెర్గూసన్‌ (19*; 16 బంతుల్లో, 1×4), కుల్‌దీప్‌ యాదవ్ (12; 19 బంతుల్లో, 1×4) జాగ్రత్తగా ఆడటంతో కోల్‌కతా ఆలౌట్‌ కాకుండా తప్పించుకుంది. కోల్‌కతా బ్యాట్స్‌మెన్‌లో గిల్‌ (1), త్రిపాఠి (1), రాణా (0), బాంటన్‌ (10), దినేశ్‌ కార్తీక్‌ (4), కమిన్స్‌ (4) పరుగులు చేశారు. బెంగళూరు బౌలర్లు నాలుగు ఓవర్లు మెయిడిన్‌ చేశారు. బెంగళూరు బౌలర్లలో సిరాజ్‌, చాహల్ (2/15), సుందర్ (1/14), సైని (1/23) అదరగొట్టారు. 


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

చిత్ర వార్తలు

మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.