close

తాజా వార్తలు

Published : 29/09/2020 01:20 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

బెంగళూరు ‘సూపర్‌’ విజయం

ఉత్కంఠ పోరులో ముంబయి ఓటమి
సూపర్‌ ఓవర్‌లో విఫలమైన రోహిత్‌సేన

ఇంటర్నెట్‌డెస్క్‌: చివరి వరకూ ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో బెంగళూరు అద్భుత విజయం సాధించింది. తొలుత 202 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు క్రీజులోకి దిగిన ముంబయి నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 201 పరుగులే చేసింది. దీంతో మ్యాచ్‌ టైగా మారి సూపర్‌ ఓవర్‌కు దారితీసింది. అక్కడ ముంబయి తొలుత బ్యాటింగ్ చేసి 7 పరుగులే చేయగా తర్వాత బెంగళూరు ఆ లక్ష్యాన్ని ఛేదించి ‘సూపర్‌’ విజయం సాధించడంతో టోర్నీలో రెండో గెలుపును రుచిచూసింది. కాగా, ముంబయి తొలుత 15 ఓవర్లకు 112/4తో నిలవడంతో అసలు గెలుస్తుందా అనే అనుమానాలు రేకెత్తాయి. అయితే, చివరి ఐదు ఓవర్లలో ఇషాన్‌ కిషన్‌(99; 58 బంతుల్లో, 2x4, 9x6), కీరన్‌ పొలార్డ్‌ (56; 23 బంతుల్లో 2x4, 5x6) రెచ్చిపోయి బ్యాటింగ్‌ చేశారు. వీరిద్దరూ 30 బంతుల్లో 89 పరుగులు చేయడంతో మ్యాచ్‌ టైగా మారింది. అంతకుముందు బెంగళూరు బౌలర్లు చెలరేగడంతో ముంబయి 39 పరుగులకే మూడు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ(8), క్వింటన్‌ డికాక్‌(14), సూర్యకుమార్‌ యాదవ్‌(0) వరుసగా విఫలమయ్యారు. దాంతో అప్పుడే ముంబయి ఓటమి ఖాయమనుకున్నారు. కానీ ఇషాన్‌, పొలార్డ్‌ పోరాటం మ్యాచ్‌ను సూపర్‌ ఓవర్‌ వరకూ తీసుకెళ్లింది. చివరికి అక్కడ ముంబయి తడబడడంతో బెంగళూరు విజయం సాధించింది.

తొలుత టాస్‌ ఓడి బ్యాటింగ్‌ చేసిన బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 201 పరుగుల భారీ స్కోర్‌ సాధించింది. చివర్లో డివిలియర్స్ ‌(55; 24 బంతుల్లో 4x4, 4x6) మెరుపు అర్ధశతకానికి తోడు శివమ్‌దూబె (27; 9 బంతుల్లో, 1x4, 3x6) చెలరేగడంతో ముంబయి ముందు భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఆరంభం నుంచే ఓపెనర్లు దేవ్‌దత్‌ పడిక్కల్ ‌(54; 40బంతుల్లో 5x4, 2x6), ఆరోన్‌ ఫించ్ ‌(52; 35 బంతుల్లో 7x4, 1x6) ధాటిగా ఆడారు. మొదట్లో పడిక్కల్‌ స్ట్రైక్‌ రొటేట్‌ చేయడంతో ఫించ్‌ చెలరేగిపోయాడు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 81 పరుగుల భాగస్వామ్యం జోడించారు. ఈ క్రమంలోనే ఫించ్‌ అర్ధశతకంపూర్తయ్యాక ధాటిగా ఆడుతూ బౌల్ట్‌ బౌలింగ్‌లో పొలార్డ్‌ చేతికి చిక్కాడు. తర్వాత క్రీజులోకి వచ్చిన కెప్టెన్‌ కోహ్లీ (3; 11 బంతుల్లో) మరోసారి నిరాశపరిచాడు. రాహుల్‌ చాహర్‌ బౌలింగ్‌లో రోహిత్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. ఆపై డివిలియర్స్‌, పడిక్కల్‌ బౌలర్లపై విరుచుకుపడుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. దేవ్‌దత్‌ కూడా అర్ధశతకం పూర్తయ్యాక బౌల్ట్‌ బౌలింగ్‌లోనే పోలార్డ్‌ చేతికి చిక్కాడు. దీంతో బెంగళూరు 154 పరుగుల వద్ద మూడో వికెట్‌ కోల్పోయింది. ఇక చివర్లో డివిలియర్స్‌ మెరుపు బ్యాటింగ్‌ చేసి అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. దూబె సైతం సిక్సర్లతో విరుచుకుపడడంతో బెంగళూరు స్కోర్‌ 200 దాటింది.


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.