ఐపీఎల్‌ పూర్తి షెడ్యూల్‌ విడుదల ఎప్పుడంటే..? 

తాజా వార్తలు

Published : 06/09/2020 01:10 IST

ఐపీఎల్‌ పూర్తి షెడ్యూల్‌ విడుదల ఎప్పుడంటే..? 

స్పష్టం చేసిన బ్రిజేష్‌ పటేల్‌

(ఫొటో: ఐపీఎల్‌ ట్విటర్‌ నుంచి)

ఇంటర్నెట్‌డెస్క్‌: క్రికెట్‌ అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఐపీఎల్‌ 2020 పూర్తి షెడ్యూల్‌ను రేపే విడుదల చేస్తున్నట్లు ఛైర్మన్‌ బ్రిజేష్‌ పటేల్‌ శనివారం మీడియాకు చెప్పారు. ఇప్పటికే టోర్నీ ఆరంభ, ఫైనల్‌ తేదీలు ఖరారైనప్పటికీ మ్యాచ్‌ల పూర్తి వివరాలు ప్రకటించలేదు. దీంతో అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది. మరోవైపు ఆరంభ మ్యాచ్‌పైనా ఆసక్తి పెరిగింది. సహజంగా గతేడాది ఫైనల్‌ చేరిన ముంబయి ఇండియన్స్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్లు తొలి మ్యాచ్‌లో ఆడాలి. అయితే, ఈరోజే ఐపీఎల్‌ ట్విటర్‌లో ఒక ఆసక్తికరమైన పోస్టర్‌ విడుదల చేసింది. 14 రోజుల్లో మెగా ఈవెంట్‌ ప్రారంభమని పేర్కొంటూ దానిపై కోహ్లీ, దినేశ్‌ కార్తిక్‌ల ఫొటోలను జతచేసింది. దీంతో ఆర్సీబీ, కేకేఆర్‌ జట్లు ఈ సీజన్‌ను ఆరంభిస్తాయా.. అనే అనుమానాలు రేకెత్తుతున్నాయి. 

తొలుత ఈ సీజన్‌ను మార్చి 29 నుంచే ప్రారంభించాల్సి ఉండగా, కరోనా పరిస్థితుల కారణంగా అది వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మెగా టోర్నీని నిర్వహించేందుకు బీసీసీఐ వేచి చూసింది. అక్టోబర్‌లో ఆస్ట్రేలియాలో జరగాల్సిన టీ20 ప్రపంచకప్‌ వాయిదా పడడంతో ఈ టోర్నీని ఏడాది పూర్తయ్యేలోపు ఎలాగైనా నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించుకుంది. యూఏఈని వేదికగా ఎంచుకొని అందుకు తగ్గ ఏర్పాట్లు చేసింది. ఈ నేపథ్యంలోనే రెండు వారాల క్రితమే అన్ని ఐపీఎల్‌ ఫ్రాంఛైజీలు తమ ఆటగాళ్లను దుబాయ్‌, అబుదాబికి తరలించాయి. అక్కడ క్వారంటైన్‌ కూడా పూర్తి చేసుకొని ప్రాక్టీస్‌ మొదలుపెట్టాయి. ఇక మిగిలింది టోర్నీ ఆరంభమే. ఈనెల 19 నుంచి ఎవరెవరు తలపడతారో తెలియాలంటే రేపటి దాకా వేచి చూడాలి. ఫైనల్‌ మాత్రం నవంబర్‌ 10న నిర్వహిస్తున్నారనే విషయం తెలిసిందే.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని