‘తాహీర్‌ను అందుకే తీసుకోవడం లేదు’
close

తాజా వార్తలు

Published : 15/10/2020 01:09 IST

‘తాహీర్‌ను అందుకే తీసుకోవడం లేదు’

(Photo: Imran Tahir twitter)

దుబాయ్‌: గతేడాది 17 మ్యాచుల్లో 26 వికెట్లు తీసిన స్పిన్నర్‌ ఇమ్రాన్‌ తాహీర్‌కు ఇంతవరకూ జట్టులో అవకాశం ఇవ్వకపోవడంపై చెన్నై జట్టు సీఈవో కాశీ విశ్వనాథన్‌ స్పందించారు. ‘రిజర్వ్‌ బెంచ్‌లో కూర్చోవడం ఆటగాళ్లకు చాలా కష్టమైన పని. ఆ విషయం మాకూ తెలుసు. అయితే, మనం నిబంధనలు పాటించాల్సిన అవసరం ఉంటుంది. జట్టులో నలుగురు విదేశీ ఆటగాళ్లను మాత్రమే తీసుకోవాలి. టాప్‌ ఆర్డర్‌లో ఇద్దరు నాణ్యమైన బ్యాట్స్‌మెన్‌ అవసరం. పేస్‌బౌలింగ్‌ ఆల్‌రౌండర్లను ఇద్దరిని జట్టులో ఉంచాలన్న ఆలోచనతో డ్వేన్‌ బ్రావో, సామ్‌ కరన్‌ను తీసుకున్నాం. రానున్న మ్యాచుల్లో తాహీర్‌కు కూడా తప్పకుండా అవకాశం కల్పిస్తాం. ద్వితీయార్ధంలో అతను రాణిస్తాడన్న నమ్మకం ఉంది. ప్రస్తుతం ఉన్న జట్టుతో మేం చాలా సంతోషంగా ఉన్నాం. యువ జట్లతో పోటీపడటం సవాల్‌తో కూడుకున్న పని’ అని ఆయన అన్నారు.

వేలంపాటలో ఎంతో నమ్మకంతో కొనుకున్న ఆటగాళ్లను ఫ్రాంచైజీలు వదులుకోవడం సరికాదని ఆయన అన్నారు. మిడ్‌ సీజన్‌ ట్రాన్స్‌ఫర్‌ గురించి విశ్వనాథన్‌ మాట్లాడారు. ‘ఈ ప్రక్రియ ద్వారా ఆటగాళ్లను వదులుకోవడం లేదా జట్టులో చేర్చుకోవడంపై చెన్నైకి ఆసక్తి లేదు. మేం మా జట్టుతోనే నిజాయతీగా ఆడాలని అనుకుంటున్నాం. ఆటగాళ్లపై విశ్వాసం ఉంచి వాళ్లను కొన్నాం. అయితే, అందులో అందరూ బాగా ఆడాలని ఏం లేదు. కొన్ని మ్యాచుల్లో విఫలమైనంత మాత్రాన వాళ్లను వదులుకోవడం సరికాదని మా అభిప్రాయం’ అని ఆయన పేర్కొన్నారు.
ఈ సీజన్‌లో ఇప్పటి వరకూ 8 మ్యాచ్‌లాడిన చెన్నై జట్టు మూడు విజయాలు సాధించింది. పాయింట్ల పట్టికలో ఆరోస్థానంలో కొనసాగుతోంది. మిడిల్‌ ఆర్డర్‌ సమస్యతో ఇబ్బంది పడుతున్నట్లు కనిపించిన చెన్నై తిరిగి పుంజుకుంది. మంగళవారం హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో 20 పరుగుల తేడాతో విజయం సాధించింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని