ఇదేం అంపైరింగ్‌? బాక్సింగ్ డే టెస్టుపై రచ్చ

తాజా వార్తలు

Published : 27/12/2020 01:03 IST

ఇదేం అంపైరింగ్‌? బాక్సింగ్ డే టెస్టుపై రచ్చ

ఇంటర్నెట్‌డెస్క్‌: మెల్‌బోర్న్‌ వేదికగా భారత్‌×ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న బాక్సింగ్‌ డే టెస్టులో ఓ వివాదం తలెత్తింది. ఆసీస్‌ కెప్టెన్‌ టిమ్‌ పైన్‌ రనౌట్‌ను థర్డ్‌ అంపైర్‌ విల్‌ పాల్సన్‌ నాటౌట్‌గా తేల్చడం చర్చనీయాంశంగా మారింది. మాజీ క్రికెటర్లు, అభిమానులు అంపైర్‌ నిర్ణయాన్ని తప్పుపడుతున్నారు.

రెండో టెస్టు తొలి రోజు ఆటలో అశ్విన్‌ బౌలింగ్‌లో గ్రీన్‌ సింగిల్‌కు ప్రయత్నించాడు. ఎక్స్‌ట్రా కవర్‌లో ఫీల్డింగ్‌ చేస్తున్న ఉమేశ్‌ బంతిని అందుకొని వికెట్‌కీపర్‌ పంత్‌కు వెంటనే అందించాడు. నాన్‌స్ట్రైకర్‌లో ఉన్న పైన్‌ క్రీజులోకి వచ్చేలోపే పంత్‌ వికెట్లను గిరాటేశాడు. అయితే థర్డ్ అంపైర్‌ విల్‌ దీన్ని నాటౌట్‌గా తేల్చాడు. పంత్‌ ఔట్‌చేసే సమయానికి పైన్‌ పూర్తిగా క్రీజులోకి రాలేదనడానికి స్పష్టమైన ఆధారాలు లేవని తెలిపాడు. కానీ క్రీజులోకి పైన్‌ పూర్తిగా రాలేదని, అతడి బ్యాట్‌ క్రీజు అంచున ఉన్నట్లు స్పష్టమైంది.

దీనిపై ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్లు షేన్‌ వార్న్‌, బ్రాడ్‌ హాగ్‌ స్పందిస్తూ ట్వీట్‌లు చేశారు. ‘‘టిమ్‌ పైన్‌ రనౌట్ నుంచి తప్పించుకోవడం ఆశ్చర్యంగా ఉంది. అతడి బ్యాట్ క్రీజుని దాటినట్లుగా కనిపించలేదు. అది ఔట్‌ అని నా అభిప్రాయం’’ అని షేన్‌ వార్న్‌ అన్నాడు. ఈ విషయంలో భారత్‌కు దురదృష్టమే ఎదురైందని బ్రాడ్ హాగ్ తెలిపాడు. భారత మాజీ క్రికెటర్లు ఆకాశ్‌ చోప్రా, వసీమ్‌ జాఫర్ తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. చోప్రా అది ఔట్ అని పేర్కొనగా, జాఫర్‌ ఫన్నీ మీమ్‌తో థర్డ్‌ అంపైర్‌ను ట్రోల్ చేస్తూ ట్వీట్ చేశాడు. అంపైర్ రిప్లేను పూర్తిగా పరిశీలించకుండానే నాటౌట్‌గా తేల్చాడని ఎద్దేవా చేశాడు.

ఇదీ చదవండి

జింక్స్‌ ఎత్తులకు కంగారూలు చిత్తు

బాక్సింగ్‌ డే టెస్టు: టీమ్‌ఇండియా 36/1



Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని