క్రికెట్‌ ఫీవర్‌ ప్రారంభం.. టాస్‌ గెలిచిన చెన్నై
close

తాజా వార్తలు

Published : 19/09/2020 19:19 IST

క్రికెట్‌ ఫీవర్‌ ప్రారంభం.. టాస్‌ గెలిచిన చెన్నై

ముంబయిపై బౌలింగ్‌ ఎంచుకున్న ధోనీ

ఇంటర్నెట్‌డెస్క్‌: అభిమానులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అతిపెద్ద టీ20 క్రికెట్‌ లీగ్‌ ప్రారంభమైంది. దీంతో ఆరు నెలల తర్వాత అసలు సిసలైన క్రికెట్‌ సందడి మొదలైంది. యూఏఈ వేదికగా 53 రోజుల పాటు జరగనున్న ఈ సుదీర్ఘ టోర్నీలో ఆరంభ మ్యాచ్‌లో ముంబయి, చెన్నై తలపడేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే టాస్‌ గెలిచిన చెన్నై కెప్టెన్‌ మహేంద్రసింగ్‌ ధోనీ తొలుత బౌలింగ్‌ ఎంచుకున్నాడు. కాగా, చాలా మంది ఆటగాళ్లు నెలల పాటు ఆటకు దూరమవడంతో తొలి మ్యాచ్‌లో ఎలా రాణిస్తారనేది ఆసక్తిగా మారింది. మరోవైపు ప్రాక్టీస్‌ సమయం తక్కువైనా ధోనీసేన ముంబయితో పోటీపడేందుకు సిద్ధమైంది.

ముంబయి జట్టు: రోహిత్‌శర్మ(కెప్టెన్‌), క్వింటన్‌ డికాక్‌, సూర్యకుమార్‌ యాదవ్‌, సౌరభ్‌ తివారి‌, కీరన్‌ పొలార్డ్‌, హార్దిక్‌ పాండ్య, కృనాల్‌ పాండ్య, జేమ్స్‌ పాటిన్‌సన్‌‌, రాహుల్‌ చాహర్‌, ట్రెంట్‌బౌల్ట్‌, జస్ప్రీత్‌ బుమ్రా.

చెన్నై జట్టు: మురళీ విజయ్‌, షేన్‌ వాట్సన్‌, ఫా డుప్లెసిస్‌, అంబటి రాయుడు, ధోనీ(కెప్టెన్‌), కేదార్‌ జాధవ్‌, సామ్‌ కరన్‌, రవీంద్ర జడేజా, పీయుష్‌ చావ్లా, దీపక్‌ చాహర్‌, లుంగి ఎంగిడి.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని