మీ సేవలు ఈ దేశం ఎప్పటికీ మర్చిపోదు..
close

తాజా వార్తలు

Updated : 01/09/2020 11:45 IST

మీ సేవలు ఈ దేశం ఎప్పటికీ మర్చిపోదు..

మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీకి క్రికెటర్ల సంతాపం

ఇంటర్నెట్‌డెస్క్‌: మాజీ రాష్ట్రపతి, భారత రత్న అత్యున్నత పురస్కార గ్రహీత ప్రణబ్‌ ముఖర్జీకి పలువురు టీమ్‌ఇండియా ప్రముఖులు నివాళులర్పించారు. సామాజిక మాధ్యమాల వేదికగా తమ సంతాపం తెలిపారు. కొద్ది రోజుల క్రితం అనారోగ్యం కారణంగా ఆస్పత్రిలో చేరిన ఆయనకు కరోనా సోకిన విషయం తెలిసిందే. అప్పటి నుంచీ దిల్లీలోని కంటోన్మెంట్‌ ఆర్మీ రీసెర్చ్‌, రెఫరల్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలోనే కొద్ది రోజులుగా ప్రణబ్‌ ఆరోగ్యం క్షీణించింది. మెదడులో రక్తం గడ్డకట్టడంతో వైద్యులు శస్త్రచికిత్స కూడా చేశారు. ఈ క్రమంలోనే విషమ పరిస్థితుల్లోకి వెళ్లిన ఆయన సోమవారం సాయంత్రం వేళ తుది శ్వాస విడిచారు.

క్రికెటర్ల స్పందన..

దేశం ఓ గొప్ప లీడర్‌ను కోల్పోయింది. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి -విరాట్‌కోహ్లీ

దేశానికే ఆదర్శవంతమైన నేత. ఆయన ఆత్మీయులకు నా సానుభూతి తెలియజేస్తున్నా. -రోహిత్‌శర్మ

మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ లేరని తెలిసి చాలా బాధేసింది. పలు దశాబ్దాల పాటు ఆయన దేశానికి ఉత్తమ సేవలందించారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నా.  -సచిన్‌ తెందూల్కర్‌

ప్రణబ్‌ ముఖర్జీ మృతి పట్ల బాధాతప్త హృదయంతో నివాళులర్పిస్తున్నా. ఓం శాంతి   -వీరేంద్ర సెహ్వాగ్‌

ఈ వార్త తెలిసి తీవ్ర మనోవేదనకు గురయ్యా. గౌరవనీయులైన నాయకుల్లో ఆయన ఒకరు. ఈ కష్ట సమయంలో ఆయన కుటుంబసభ్యులకు ఆ భగవంతుడు శక్తినివ్వాలి. ఆయన సేవలను ఈ దేశం ఎప్పటికీ గుర్తుంచుకుంటుంది. -గౌతమ్‌ గంభీర్‌

మాజీ రాష్ట్రపతి మృతిపట్ల ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. ప్రణబ్‌ జీ మీరు చేసిన సేవలు ఈ దేశం ఎప్పటికీ మర్చిపోదు. -రవిశాస్త్రి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని