close

తాజా వార్తలు

Updated : 01/12/2020 10:13 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

100 మంది చిన్నారులకు సచిన్‌ సాయం  

ముంబయి: భారత క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ తెందుల్కర్‌ తన దాతృత్వాన్ని మరోసారి చాటుకున్నాడు. వివిధ వ్యాధులతో బాధపడుతున్న ఆరు రాష్ట్రాలకు చెందిన 100 మంది పేద చిన్నారులకు ఓ సేవా సంస్థ ద్వారా అతను వైద్య సహాయాన్ని అందించనున్నాడు. ప్రభుత్వ, ట్రస్టు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న చిన్నారులకు ఇ-కామ్‌ ఫౌండేషన్‌ భాగస్వామ్యంతో మహారాష్ట్ర, అసోం, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో సచిన్‌ ఈ సేవలు అందిస్తున్నాడు. ‘‘చిన్నారులకు వైద్య సహాయం అందించడం కోసం తెందుల్కర్‌తో కలిసి పని చేయడం చాలా సంతోషంగా ఉంది. పేదలకు నాణ్యమైన వైద్యాన్ని అందించాలన్నదే మా లక్ష్యం’’ అని ఇ-కామ్‌ ఫౌండేషన్‌ పేర్కొంది. ఈ నెల ఆరంభంలో అసోంలోని కరీంగంజ్‌ జిల్లాలోని మకుంద ఆసుపత్రిలో పిల్లల అత్యవసర విభాగానికి సచిన్‌ వైద్య పరికరాలు అందించాడు. యూనెసెఫ్‌కు తెందుల్కర్‌ సౌహార్ద్ర రాయబారిగా ఉన్న సంగతి తెలిసిందే.
 


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

చిత్ర వార్తలు

సినిమా
మరిన్ని

దేవతార్చన