కపిల్‌ పాజీ కోలుకోవాలి.. క్రికెటర్ల ఆకాంక్ష

తాజా వార్తలు

Published : 24/10/2020 02:04 IST

కపిల్‌ పాజీ కోలుకోవాలి.. క్రికెటర్ల ఆకాంక్ష

ఇంటర్నెట్‌ డెస్క్‌: భారతదేశానికి క్రికెట్‌లో తొలి ప్రపంచ కప్‌ అందించిన మాజీ సారథి కపిల్‌దేవ్‌ ఛాతీనొప్పితో ఆస్పత్రిలో చేరారు. ఆయనకు యాంజియోప్లాస్టీ చికిత్స చేశామని, కపిల్‌ ఆరోగ్యం నిలకడగానే ఉందని దిల్లీలోని ఫోర్టిస్ ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం ఐసీయూలో ఉన్న కపిల్‌ రెండు మూడు రోజుల్లో ఇంటికి వచ్చే అవకాశముందని వైద్య నిపుణులు తెలిపారు. ఈ నేపథ్యంలో తమ ‘పాజీ’ (అన్న) త్వరగా కోలుకోవాలని ఆయన సహచరులు, క్రీడాకారులు ప్రార్థిస్తున్నారు. తమ ఆకాంక్షలను వారు సామాజిక మాధ్యమాల ద్వారా ఈ విధంగా వెల్లడించారు.

‘‘టేక్‌ కేర్‌ కపిల్‌దేవ్‌! మీరు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను. గెట్‌వెల్‌ సూన్‌ పాజీ!’’-సచిన్‌ తెందూల్కర్‌

‘‘మీరు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను. గెట్‌ వెల్‌ సూన్‌ పాజీ.’’-విరాట్‌ కోహ్లీ

‘‘మీరు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను కపిల్‌ సర్‌.. టేక్ కేర్‌, గాడ్‌ బ్లెస్‌..’’-సురేశ్‌ రైనా

‘‘మీరు త్వరగా కోలుకోవాలి కపిల్‌ సర్‌. ఎప్పుడూ శక్తిమంతంగా ఉండాలి.’’-శిఖర్‌ ధావన్‌

‘‘యాంజియోప్లాస్టీ అనంతరం గ్రేట్‌ కపిల్‌దేవ్‌ త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నాను. పాజీ, మీరెప్పుడూ ఫైటర్‌ గానే ఉన్నారు. ఈ పరిస్థితితో కూడా ఫైట్‌ చేసి బయటకు వస్తారు.’’-మహమ్మద్‌ కైఫ్‌

‘‘దృఢంగా ఉండు బిగ్‌ బ్రదర్‌. గాడ్‌ బ్లెస్‌ యూ.’’-రవి శాస్త్రి

‘‘గెట్‌ వెల్ సూన్‌ పాజీ (త్వరగా కోలుకోవాలి అన్నా..)’’-అనిల్‌ కుంబ్లే

‘‘కపిల్‌ పాజీ త్వరగా కోలుకోవాలి. మీరు వేగంగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను’’-వీవీఎస్‌ లక్ష్మణ్‌

‘‘కపిల్‌దేవ్‌ త్వరగా కోలుకోవాలని కపిల్‌ రోమీలకు ప్రార్థనలు, శక్తి, ఆకాంక్షలు తెలిపేందుకు నాతో చేయి కలపండి. కపిల్‌కు అస్వస్థతగా ఉండటంతో ఆస్పత్రికి తీసుకెళ్లారు. యాంజియోప్లాస్టీ చికిత్స విజయవంతమైందని వైద్యులు ప్రకటించారు. ఆయన త్వరలోనే ఇంటికి తిరిగివస్తారు. కపిల్‌ పరిస్థితిని గురించి విచారించిన వారికి, ప్రార్థించిన వారి సందేశాన్ని వారి కుటుంబానికి తెలిపాము. వారు కృతజ్ఞతలు తెలియచేశారు. గుడ్‌ హెల్త్‌ అండ్‌ స్ట్రెంగ్త్‌.. కాప్స్‌!’’-మదన్‌లాల్‌

‘‘మీ క్షేమం గురించి నేను ప్రార్థిస్తున్నాను. మీరు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను కపిల్‌దేవ్‌ పాజీ..’’-ఇర్ఫాన్‌ పఠాన్‌


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని