డేవిడ్ వార్నర్‌ ‘మహర్షి’ టీజర్‌ చూశారా? 

తాజా వార్తలు

Updated : 31/12/2020 12:46 IST

డేవిడ్ వార్నర్‌ ‘మహర్షి’ టీజర్‌ చూశారా? 

2020లో అలరించిన ఆస్ట్రేలియా ఆటగాడు

మెల్‌బోర్న్‌: ఆస్ట్రేలియా ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ 2020లో ఎంతగా అలరించాడో అందరికీ తెలిసిందే. కరోనా వైరస్‌ నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్‌ను అతడెంతో చక్కగా ఉపయోగించుకున్నాడు. హాయిగా కుటుంబ సభ్యులతో గడుపుతూనే టిక్‌టాక్‌ వీడియోలతో ఆకట్టుకున్నాడు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు సాధించాడు. అలాగే తెలుగు సినిమా పాటలు, డైలాగులతో పలువురు టాలీవుడ్‌ టాప్‌ హీరోల అనుకరణ వీడియోలు రూపొందించాడు. దాంతో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ అభిమానులకు మరింత చేరువయ్యాడు. 

కాగా, మరికొద్దిగంటల్లో ఈ ఏడాది కాలగర్భంలో కలుస్తున్న నేపథ్యంలో వార్నర్‌ తాజాగా మరో వీడియోను అభిమానులతో పంచుకున్నాడు. సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబు నటించిన ‘మహర్షి’ సినిమా టీజర్‌ను ఎడిట్‌ చేసి.. అందులోని సన్నివేశాలకు తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. స్కూటర్‌పై మహేశ్‌.. వెన్నెల కిషోర్‌తో వెళ్లే సీన్‌తో పాటు డైలాగులు, ఫైటింగ్‌ల సీన్లలో ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్‌‌ అదరగొట్టాడు. ఆ వీడియోను ఇన్‌స్టాలో పంచుకోవడంతో అభిమానులు లైకులు కొడుతున్నారు. ఈ సందర్భంగా 2020లో వార్నర్‌ పంచుకొన్న మరిన్ని వీడియోలను కడా చూసి ఎంజాయ్‌ చేయండి..

ఇవీ చదవండి..
అసలిది ఆసీస్‌ బ్యాటింగ్‌ లైనప్పేనా: సచిన్‌
అనుకున్నామా.. అమ్మాయిల కోసం ఏడుస్తామని!

 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని