టెస్టు సిరీస్‌కు ముందే ఆసీస్‌కు షాక్‌

తాజా వార్తలు

Published : 09/12/2020 10:52 IST

టెస్టు సిరీస్‌కు ముందే ఆసీస్‌కు షాక్‌

అడిలైడ్‌ డే/నైట్‌ టెస్టుకు వార్నర్‌ దూరం

ఇంటర్నెట్‌డెస్క్‌: ఆస్ట్రేలియా జట్టును గాయాల బెడద వేధిస్తోంది. తొడకండరాల గాయంతో భారత్‌తో ఆఖరి వన్డే, టీ20 సిరీస్‌కు దూరమైన ఆసీస్‌ ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్ తొలి టెస్టుకు కూడా దూరం కానున్నాడు. ఈ విషయాన్ని ఆస్ట్రేలియా క్రికెట్‌ బోర్డు ట్విటర్‌ వేదికగా వెల్లడించింది. డిసెంబర్ 17 నుంచి భారత్, ఆస్ట్రేలియా మధ్య నాలుగు టెస్టుల సిరీస్‌ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. అడిలైడ్ వేదికగా తొలి డే/నైట్ టెస్టు జరగనుంది. అయితే, పూర్తి ఫిట్‌నెస్ సాధించడానికి మరో పది రోజుల సమయం పడుతుందని వార్నర్‌ తెలిపాడు. మెల్‌బోర్న్‌ వేదికగా జరిగే రెండో టెస్టుకు అందుబాటులో ఉండాలని ప్రయత్నిస్తున్నాడు.

‘‘గాయం నుంచి దాదాపు కోలుకున్నా. అయితే టెస్టు మ్యాచ్ పరిస్థితులకు తగ్గట్లుగా 100 శాతం ఫిట్‌గా ఉండాలని భావిస్తున్నా. బరిలోకి దిగినప్పుడు వికెట్ల మధ్య పరుగెత్తడంలో, మైదానంలో చురుకుగా ఉండాలి.  పూర్తి ఫిట్‌నెస్‌ సాధించడానికి మరో 10 రోజులు పడుతుంది’’ అని డేవిడ్‌ వార్నర్ అన్నాడు. సిడ్నీ వేదికగా జరిగిన రెండో వన్డేలో ఫీల్డింగ్‌ చేస్తూ వార్నర్‌ గాయపడిన సంగతి తెలిసిందే. డేవిడ్‌ గాయం గురించి ఆస్ట్రేలియా జట్టు కోచ్‌ జస్టిన్‌ లాంగర్‌ మాట్లాడుతూ.. అతడు మెల్‌బోర్న్‌ టెస్టుకు పూర్తిఫిట్‌నెస్ సాధిస్తాడని ఆశిస్తున్నట్లు తెలిపాడు. 

డే/నైట్‌ టెస్టుకు ఫామ్‌లో ఉన్న వార్నర్‌ దూరం కావడం ఆస్ట్రేలియాకు ప్రతికూలాంశమే. పరిమిత ఓవర్ల క్రికెట్‌ జట్టులో అతడు లేని లోటు స్పష్టంగా కనిపించింది. గులాబి బంతితో బౌలర్లు ఆధిపత్యం ప్రదర్శించే డే/నైట్ మ్యాచ్‌లో అనుభవజ్ఞుడు వార్నర్‌ జట్టును బలోపేతం చేస్తాడనడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే, ఆసీస్‌ యువ ఓపెనర్‌ విల్‌ పకోస్కీ కూడా కంకషన్‌కు గురికావడం ఆ జట్టు‌ను కలవరపెడుతోంది. ప్రాక్టీస్ మ్యాచ్‌లో కార్తీక్‌ త్యాగి విసిరిన బౌన్సర్‌ అతడి హెల్మెట్‌కు తాకింది. అతడిలో కంకషన్‌ లక్షణాలు స్వల్పంగా కనిపించడంతో డిసెంబర్‌ 11 నుంచి జరిగే రెండో ప్రాక్టీస్‌ మ్యాచ్‌కు దూరమయ్యాడు.

ఇదీ చదవండి

ఇంటికొచ్చేస్తున్నా: పాండ్య

క్యాచ్‌లు ఇలా వదిలేస్తే..


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని