close

తాజా వార్తలు

రంజీ మ్యాచ్‌కు పౌరసత్వ బిల్లు సెగ

గువాహటి: పౌరసత్వ సవరణ బిల్లు (క్యాబ్‌)కు రాజ్యసభలోనూ ఆమోదం లభించడంతో ఈశాన్య రాష్ట్రాలు అట్టుడికిపోతున్నాయి. అసోం, త్రిపురల్లో నిరసన జ్వాలలు తారస్థాయికి చేరుకోవడంతో నిరవధిక కర్ఫ్యూ విధించారు. దీంతో గువాహటిలో జరుగుతున్న అసోం× సర్వీసెస్‌ (ఎస్‌ఎస్‌సీబీ) రంజీ మ్యాచ్‌కు ఆటంకం ఏర్పడింది. మ్యాచ్‌ నాలుగో రోజు ఆటను నిలిపివేశారు. గువాహటిలో అసోం× సర్వీసెస్‌ మ్యాచ్‌ నిలిపివేస్తున్నట్లు బీసీసీఐ క్రికెట్‌ ఆపరేషన్స్‌ జనరల్‌ మేనేజర్‌ కరీమ్‌ తెలిపారు. తొలుత అగర్తలాలో జరుగుతున్న త్రిపుర×ఝార్ఖండ్‌ మ్యాచ్‌ నాలుగో రోజు ఆటను కూడా నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. కానీ కొన్ని గంటల తర్వాత మ్యాచ్‌ షెడ్యూల్‌ ప్రకారం యధావిధిగా జరుగుతుందని పేర్కొన్నారు.

అంతేకాకుండా, ఇండియన్‌ సూపర్‌ లీగ్‌ నార్త్‌ఈస్ట్‌ యునైటెడ్ ఎఫ్‌సీ× చెన్నయిన్‌ ఎఫ్‌సీ మ్యాచ్‌కు పౌరసత్వ సవరణ బిల్లు సెగ తాకింది. గువాహటిలోని ఇందిరా గాంధీ అథ్లెటిక్స్‌ స్టేడియంలో నేడు జరగనున్న ఈ చెన్నై మ్యాచ్‌ను వాయిదా వేస్తున్నామని ఫుట్‌బాల్ స్పోర్ట్స్‌ డెవలెప్‌మెంట్‌ లిమిటెడ్ తెలిపింది.



Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.