close

తాజా వార్తలు

Updated : 24/10/2020 15:07 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

టాస్‌ గెలిచి బౌలింగ్‌‌ ఎంచుకున్న దిల్లీ

ఇంటర్నెట్‌డెస్క్‌: టీ20 లీగ్‌లో వరుస విజయాలతో దూసుకుపోతున్న దిల్లీ మరికాసేపట్లో కోల్‌కతాను ఢీ కొనబోతోంది. ఈ సందర్భంగా టాస్‌ గెలిచిన దిల్లీ కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌‌ బౌలింగ్‌‌ ఎంచుకున్నాడు. కాగా, ఇప్పటివరకు దిల్లీ ఆడిన 10 మ్యాచ్‌ల్లో 7 విజయాలు సాధించి ముంబయి, బెంగళూరు జట్లతో సమానంగా కొనసాగుతోంది. మరోవైపు కోల్‌కతా 5 విజయాలతో నాలుగో స్థానంలో నిలిచింది. ఈ నేపథ్యంలో దిల్లీ విజయం సాధించి టాప్‌లోకి దూసుకెళ్లాలని చూస్తుండగా, కోల్‌కతా ప్లేఆఫ్‌ అవకాశాలను మెరుగుపర్చుకోవాలని భావిస్తోంది. 

కోల్‌కతా జట్టు: శుభ్‌మన్‌ గిల్‌, సునీల్‌ నరైన్‌, నితీశ్‌ రాణా, రాహుల్‌ త్రిపాఠి,  ఇయాన్‌ మోర్గాన్‌(కెప్టెన్‌), దినేశ్‌ కార్తీక్‌, పాట్‌ కమిన్స్‌, లాకీ ఫెర్గూసన్‌, కమలేశ్‌ నాగర్‌కోటి, ప్రసిధ్‌ కృష్ణ, వరుణ్‌ చక్రవర్తి

దిల్లీ: శిఖర్‌ ధావన్‌, అజింక్య రహానె, శ్రేయస్‌ అయ్యర్‌(కెప్టెన్‌), రిషభ్‌పంత్‌, మార్కస్‌ స్టోయినిస్‌, షిమ్రన్‌ హెట్‌మైయిర్‌, అక్షర్‌ పటేల్‌, రవిచంద్రన్‌ అశ్విన్‌, కగిసో రబాడ, తుషార్‌ దేశ్‌పాండే, అన్‌రిచ్‌ నోర్జే
 


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

చిత్ర వార్తలు

సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.