బౌలింగ్‌ ఎంచుకున్న దిల్లీ
close

తాజా వార్తలు

Updated : 27/10/2020 19:08 IST

బౌలింగ్‌ ఎంచుకున్న దిల్లీ

ఇంటర్నెట్‌డెస్క్‌: రసవత్తరంగా సాగుతున్న లీగ్‌లో మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. దుబాయ్‌ వేదికగా దిల్లీ×హైదరాబాద్‌ జట్లు తలపడనున్నాయి. టాస్ గెలిచిన దిల్లీ బౌలింగ్‌‌ ఎంచుకుంది. ఇరు జట్లు 11 మ్యాచ్‌లు ఆడగా ఏడు విజయాలతో దిల్లీ రెండో స్థానంలో, ఏడు పరాజయాలతో హైదరాబాద్‌ ఏడో స్థానంలో నిలిచాయి. ఈ మ్యాచ్‌లో విజయం సాధిస్తే దిల్లీ ప్లేఆఫ్ బెర్తు ఖరారు కానుంది. మరోవైపు ప్లేఆఫ్ రేసులో నిలవాలంటే వార్నర్‌సేన ఈ మ్యాచ్‌లో కచ్చితంగా గెలవాలి. అయితే టాప్‌-4లో హైదరాబాద్ నిలవాలంటే తర్వాతి మ్యాచ్‌ల్లో విజయం సాధించడంతో పాటు ఇతర జట్ల ఫలితాలపై కూడా ఆధారపడి ఉంటుంది.

జట్ల వివరాలు:

దిల్లీ: శిఖర్‌ ధావన్‌, రహానె, శ్రేయస్‌ అయ్యర్‌ (కెప్టెన్), పంత్‌, హెట్‌మైయర్‌, స్టాయినిస్, అక్షర్‌ పటేల్‌, రవిచంద్రన్‌ అశ్విన్‌, రబాడ, నోర్జె, తుషార్‌ దేశ్‌పాండే

హైదరాబాద్‌: వార్నర్‌ (కెప్టెన్‌), విలియమ్సన్‌, మనీష్‌ పాండే, విజయ్‌ శంకర్, వృద్ధిమాన్‌ సాహా, హోల్డర్‌, అబ్దుల్‌ సమద్‌, రషీద్‌ ఖాన్‌, నదీమ్‌, సందీప్‌ శర్మ, నటరాజన్‌


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని