శ్రేయస్ కోలుకుంటున్నాడు:  ధావన్‌
close

తాజా వార్తలు

Updated : 15/10/2020 15:24 IST

శ్రేయస్ కోలుకుంటున్నాడు:  ధావన్‌

దుబాయ్‌: దిల్లీ జట్టు కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌కు ఎలాంటి ఇబ్బంది లేదని ఆ జట్టు తాత్కాలిక  సారథి శిఖర్‌ ధావన్‌ అన్నాడు. ప్రస్తుతం అతను చేతిని కదల్చగలుగుతున్నాడని, అయితే వైద్య నివేదిక వచ్చిన తర్వాతే పూర్తి వివరాలు తెలుస్తాయని చెప్పాడు. యూఏఈలో జరుగుతున్న టీ20 లీగ్‌లో భాగంగా బుధవారం రాజస్థాన్‌ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో దిల్లీ 13 పరుగుల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. రాజస్థాన్‌ బ్యాటింగ్‌ చేస్తున్న సమయంలో స్టోక్స్‌ కొట్టిన బంతిని ఆపే క్రమంలో అతడు డైవ్‌ చేశాడు. ఈ క్రమంలో భుజానికి గాయం కావడంతో మైదానంలోనే విలవిల్లాడాడు. తీవ్ర ఇబ్బంది పడుతూ శ్రేయస్‌ మైదానం నుంచి బయటకు వెళ్లిపోయాడు.

మ్యాచ్‌ అనంతరం ధావన్ మాట్లాడుతూ.. శ్రేయస్‌ పరిస్థితిపై మాట్లాడాడు. ప్రస్తుతం నొప్పి ఎక్కువగానే ఉందని, అయితే చేయిని మాత్రం కదల్చగలుగుతున్నాడని చెప్పాడు. నివేదికలు వచ్చిన తర్వాతే పూర్తి వివరాలు తెలుస్తాయన్నాడు. గెలుపులో కీలకంగా వ్యవహరించిన రబాడా, నోర్జేజ్‌లను ధావన్ అభినందించాడు.మేం ఎలాంటి బంతులు కోరుకున్నామో, కచ్చితంగా అవే బంతులు వేశారని అన్నాడు. యువ బౌలర్‌ తుషార్‌ దేశ్‌ పాండేను ధావన్‌ ప్రత్యేకంగా అభినందించాడు. తన లైన్‌ అండ్‌ లెంగ్త్‌ బౌలింగ్‌తో ఆకట్టుకున్నాడన్నాడు.

రాజస్థాన్‌ కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌ మాట్లాడుతూ.. సరైన సమయంలో వికెట్లు తీయడంలో జట్టు విఫలమైందన్నాడు. పిచ్‌ కూడా అంతగా సహకరించలేదని చెప్పాడు. ‘‘ఈ మ్యాచ్‌ మమ్మల్ని చాలా నిరాశకు గురి చేసింది. బట్లర్‌ (22; 9 బంతుల్లో) బెన్‌ స్టోక్స్‌ (41; 35 బంతుల్లో )తో మా ప్రారంభం బాగానే ఉన్నప్పటికీ తర్వాత వరుసగా వికెట్లు కోల్పోవడంతో అవకాశాలు చేజార్చుకున్నాం’’ అని తెలిపాడు. మరోవైపు తాము బౌలింగ్‌ బాగానే చేశామని, 161 పరుగులకే కట్టడి చేయగలిగామని వెల్లడించాడు. జట్టు పరిస్థితులపై మరింత ఆలోచించాల్సిన అవసరముందన్నాడు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని