రిషభ్‌ పంత్‌.. ఇంతేనా!
close

తాజా వార్తలు

Updated : 12/12/2020 10:58 IST

రిషభ్‌ పంత్‌.. ఇంతేనా!

సిడ్నీ: ధనాధన్‌ బ్యాటింగ్‌తో.. వికెట్ల వెనుక మంచి ప్రదర్శనతో ఒకప్పుడు భారత జట్టుకు భవిష్యత్‌ ఆశాకిరణంలా కనిపించాడు పంత్‌. కానీ తర్వాత తనపై ఉన్న అంచనాలను అందుకోవడం లేదు. అవకాశాలను అందిపుచ్చుకోవడం లేదు. బ్యాటింగ్‌లో నిలకడగా విఫలమవుతూనే ఉన్నాడు. దీంతో ఇప్పటికే పరిమిత ఓవర్ల క్రికెట్లో అతని స్థానాన్ని కేఎల్‌ రాహుల్‌ లాగేసుకున్నాడు. టెస్టుల్లో చూస్తేనేమో తొలి ప్రాధాన్యం సాహాకే ఉంది. అయినప్పటికీ ఆస్ట్రేలియాలో పంత్‌ రికార్డు బాగుండడంతో రెండో సన్నాహక మ్యాచ్‌లో అవకాశం ఇస్తే దాన్నీ సద్వినియోగం చేసుకోలేకపోయాడు. జట్టు కష్టాల్లో ఉన్న సమయంలో నిలబడాల్సింది పోయి వికెట్‌ చేజార్చుకున్నాడు. జట్టు 111/5తో ఉన్న దశలో ఎప్పటిలాగే లెగ్‌సైడ్‌ ఆడేందుకు ప్రయత్నించి ఎల్బీగా వెనుదిరిగాడు. కేవలం 11 బంతులే ఎదుర్కొని 5 పరుగులు చేశాడు. ఈ నేపథ్యంలో 23 ఏళ్ల పంత్‌ తన ఆటతీరును మార్చుకోకపోతే టీమ్‌ఇండియాకు పూర్తిగా దూరమయ్యే ప్రమాదం ఉంది.

ఇవీ చదవండి..

ఆ అయిదు రోజులూ అదే పాట..

ఆస్ట్రేలియాకు హిట్‌మ్యాన్‌
 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని