డ్రీమ్‌ 11.. ఐపీఎల్‌ కొత్త స్పాన్సర్‌

తాజా వార్తలు

Updated : 18/08/2020 16:23 IST

డ్రీమ్‌ 11.. ఐపీఎల్‌ కొత్త స్పాన్సర్‌

ఈ ఏడాది వీవో రద్దు చేసుకోవడంతో..

ఇంటర్నెట్‌డెస్క్‌: ఐపీఎల్‌ టైటిల్‌ స్పాన్సర్‌గా కొన్నేళ్లుగా కొనసాగుతున్న ప్రముఖ మొబైల్‌ సంస్థ వీవో ఈ ఏడాది తప్పుకోవడంతో ‘డ్రీమ్‌ 11’ అనే కొత్త సంస్థ పదమూడో సీజన్‌ హక్కులను దక్కించుకుంది. 2018 నుంచి 2022 వరకు తొలుత వీవో సంస్థ టైటిల్‌ స్పాన్సర్‌గా బీసీసీఐతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ లెక్కన ఏడాదికి  రూ.400 కోట్లకు పైగా చెల్లించేది. ఇటీవల భారత్‌-చైనాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు తలెత్తడంతో ఇక్కడ డ్రాగన్‌ వస్తువుల బహిష్కరణ ఉద్యమం ఊపందుకుంది. ఈ నేపథ్యంలోనే వీవో ఈ ఏడాది తప్పుకుంటున్నట్లు కొద్ది రోజలు క్రితం ప్రకటించింది.

అయితే, వచ్చేనెల నుంచి యూఏఈలో ప్రారంభయ్యే పదమూడో సీజన్‌ కోసం బీసీసీఐ తాజాగా కొత్త సంస్థలను ఆహ్వానించింది. ఈ మేరకు పలు దేశీయ దిగ్గజ సంస్థలు కూడా పోటీ పడ్డాయి. ప్రముఖంగా పతంజలి, టాటా, బైజుస్‌, అన్‌ అకాడమీ లాంటి సంస్థలు ఆసక్తి చూపాయి. చివరికి డ్రీమ్‌ 11 రూ.222 కోట్లు చెల్లించేందుకు ముందుకు రాగా బీసీసీఐ ఆమోదం తెలిపింది.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని