అలా అంటారా? వార్న్‌ సారీ చెప్పాల్సిందే!
close

తాజా వార్తలు

Updated : 17/12/2020 16:22 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అలా అంటారా? వార్న్‌ సారీ చెప్పాల్సిందే!

అడిలైడ్‌: భారత్‌, ఆస్ట్రేలియా మధ్య తొలి గులాబి సమరం ఆసక్తికరంగా సాగుతోంది. ఒకరిపై మరొకరు ఆధిపత్యం ప్రదర్శించేందుకు ప్రయత్నిస్తున్నారు. కంగారూ బౌలర్లు చురకత్తుల్లాంటి బంతులు సంధిస్తున్నారు. టీమ్‌ఇండియా బ్యాట్స్‌మెన్‌ వాటిని ఆచితూచి ఎదుర్కొంటున్నారు. అయితే ఓపెనర్లు పృథ్వీషా (0), మయాంక్‌ అగర్వాల్‌ (17; 40 బంతుల్లో 2×4) త్వరగా ఔటైన వేళ నయావాల్‌ చెతేశ్వర్‌ పుజారా (43; 160 బంతుల్లో 2×4) ప్రత్యర్థి బౌలర్ల సహనానికి పరీక్ష పెట్టాడు. బంతి ఏదైనా అడ్డుకోవడమే తన లక్ష్యం అన్నట్టుగా ఆడాడు. అతడి ఆటతీరును విశ్లేషిస్తూ షేన్‌ వార్న్‌ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వివాదస్పదంగా మారాయి.

ఇంగ్లిష్ కౌంటీ క్రికెట్లో యార్క్‌షైర్‌కు ఆడుతున్నప్పుడు పుజారాను అక్కడి సహచరులు ‘స్టీవ్‌’ అని పిలిచేవారని వార్న్‌ అన్నాడు. చెతేశ్వర్‌ అని పలకడం కష్టమనిపించడంతో ఇంగ్లిష్‌ ఆటగాళ్లు అలా పిలిచేవారని వివరించాడు. ఇంకా మరికొన్ని విషయాలు చెప్పాడు. ఆ క్రమంలో కామెంటరీ బాక్స్‌లో ఉన్న మిగతా వారూ ముసిముసిగా నవ్వారు. అయితే ఆసియా వాసులు, ఇతర వర్ణాల వారిని యార్క్‌షైర్‌ ఆటగాళ్లు వర్ణ వివక్షతో అలా పిలిచేవాళ్లని ఈ మధ్యే ఓ విచారణలో తేలింది. యార్క్‌షైర్‌ క్రికెటర్‌ అజీమ్‌ రఫీక్‌ కేసు పెట్టడంతో ఇదంతా బయటకొచ్చింది. ఇదంతా నిజమేనని ఆ కౌంటీకి చెందిన ఓ ఉద్యోగి తాజ్‌ భట్‌ సైతం చెప్పడం గమనార్హం.

‘ఆసియా జాతికి చెందిన టాక్సీ డ్రైవర్లు, రెస్టారంట్‌ పనివాళ్లను అక్కడ నిరంతరం (స్టీవ్‌) ఇలాగే పిలుస్తారు. ప్రతి వర్ణానికి చెందిన వ్యక్తులను స్టీవ్‌ అంటారు. బయట దేశం నుంచి వచ్చిన క్రికెట్‌ ప్రొఫెషనల్‌ చెతేశ్వర్‌ పుజారానూ అలాగే పిలిచేవారు. ఎందుకంటే అతడిని పేరును పలకలేకపోవడమే కారణం’ అని భట్‌ ఈఎస్‌పీఎన్‌ క్రిక్‌ఇన్ఫోకు వెల్లడించాడు. యార్క్‌షైర్‌ ఆటగాళ్లు తనను స్టీవ్‌ అని పిలిచేవారని గతంలో పుజారా సైతం చెప్పడం గమనార్హం. వర్ణ వివక్షకు చెందిన పదమని విచారణలో బయటపడ్డాకా ‘స్టీవ్‌’ అని రిఫర్‌ చేయడంతో వార్న్‌పై అభిమానులు విమర్శలు గుప్పిస్తున్నారు. నయావాల్‌కు క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేస్తున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని