close
Array ( ) 1

తాజా వార్తలు

గ్రేట్‌: భారత క్రికెటర్లు సలహాలకు వెనుకాడరు

చిట్కాలు చెప్పేందుకు టీమ్‌ఇండియా ఆటగాళ్లు ఎప్పుడూ సిద్ధం: ఇష్‌ సోధి

వెల్లింగ్టన్‌: టీమ్‌ఇండియా క్రికెటర్లపై న్యూజిలాండ్‌ స్పిన్నర్‌ ఇష్ సోధి ప్రశంసలు కురిపించాడు. సంప్రదించే ప్రతి ఒక్కరితో విజ్ఞానం, అస్త్రాలను పంచుకొనేందుకు వారు సిద్ధంగా ఉంటారని కొనియాడాడు. రవిచంద్రన్‌ అశ్విన్‌, రవీంద్ర జడేజా, యుజువేంద్ర చాహల్‌, పంత్‌ సహా చాలామందితో తాను క్రికెట్‌ అంశాలను చర్చించానని వెల్లడించాడు. భారత్‌లోని లూథియానాలోనే సోధి జన్మించాడు. చిన్నప్పుడే వారి కుటుంబం న్యూజిలాండ్‌లో స్థిరపడిన సంగతి తెలిసిందే.

‘టీమ్‌ఇండియా ఆటగాళ్ల నుంచి విజ్ఞానం పొందాలనుకుంటే వారిని గౌరవంతో సంప్రదించాలి. అనుభవాలు, రహస్యాలను పంచుకొనేందుకు వారెప్పుడూ సిద్ధంగా ఉంటారు. ఎలా సాధన చేస్తావని రవీంద్ర జడేజాను అడిగా. ఆఫ్ స్పిన్నర్‌గా ఉండి క్యారమ్‌ బంతి, గూగ్లీలు ఎలా విసురుతున్నారని అశ్విన్‌ను ప్రశ్నించా. స్పిన్నర్ల బౌలింగ్‌లో భారీ సిక్సర్లు బాదే పంత్‌తో సైతం మాట్లాడా. ఏ లెంగ్తుల్లో వేస్తే ఇబ్బంది పడతావని అడిగా. స్పిన్నర్లపై అతడిలా లెంగ్త్‌లను దొరకబుచ్చుకొనే ఆటగాడిని చూడలేదు’ అని సోధి అన్నాడు.

లెగ్‌ స్పిన్నర్ల బౌలింగ్‌లో ఎక్కువగా ఔటవుతున్నా భారత జట్టు సారథి విరాట్‌ కోహ్లీ అద్భుతంగా ఆడతాడని సోధి పేర్కొన్నాడు. ‘లెగ్‌ స్పిన్నర్లకు కోహ్లీ ఎక్కువగా దొరుకుతున్నాడు. అయినప్పటికీ వారి బౌలింగ్‌లో అతడు ఎక్కువగా పరుగులు చేస్తాడు. అతడు నిలకడకు మారుపేరు. అతడిపై ప్రతి బంతికీ దాడి చేస్తూనే ఉండాలి. లేదంటే బతకనివ్వడు. విరాట్‌కు బంతులు విసిరాలంటే ధైర్యం అవసరం. రాజస్థాన్‌ రాయల్స్‌కు స్పిన్‌ సలహాదారుగా ఉండటం సవాలే. విదేశీ క్రికెటర్లకు ఎలాంటి బంతులు వేయాలో నేను వ్యూహాలు రచిస్తా. ఒకప్పుడు షేన్‌వార్న్‌ నాకు సలహాలు ఇచ్చారు. పరిస్థితులు ఎలా ఉన్నా చక్కని ప్రాంతాలను ఎంచుకొని ప్రశాంతంగా బంతిని సుడులు తిప్పాలని సూచించారు. స్పిన్‌ సలహాదారుగా ఉండటమే కాకుండా ఫ్రాంచైజీ వ్యాపార వ్యవహారాలు, నిర్వహణ ఎలా ఉంటాయో తెలుసుకోవాలని భావిస్తున్నా’ అని సోధి పేర్కొన్నాడు.

వెల్లింగ్టన్‌లో టీమ్‌ఇండియాతో తొలి టెస్టులో సోధి ఆడటం లేదు. స్పిన్నర్లు అక్కడ స్టంప్స్‌ లక్ష్యంగా బంతులు వేయాలని సూచించాడు. ఎక్కువగా వికెట్ల ముందు దొరకబుచ్చుకొనేందుకు ప్రయత్నించాలన్నాడు. ఇక రెండో టెస్టు జరిగే క్రైస్ట్‌చర్చ్‌ వేదికగా కివీస్‌లోనే అత్యంత వేగవంతమైన పిచ్‌ అని తెలిపాడు. చక్కని పచ్చికతో బౌన్స్‌ ఎక్కువ అవుతుందన్నాడు. సీమర్లు అవకాశాన్ని అందిపుచ్చుకుంటే బ్యాటర్లకు కష్టమేనని తెలిపాడు.


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా
Saket Pranamam
HITS2020
VITEEE 2020
dr madhu
besttaxfiler

Panch Pataka

దేవతార్చన