
తాజా వార్తలు
కోహ్లీ కెప్టెన్సీ అర్థం కావడం లేదు: గంభీర్
ఇంటర్నెట్‌డెస్క్: ఆస్ట్రేలియాతో వరుసగా రెండో వన్డే ఓటమిపాలవ్వడంపై టీమ్ఇండియా మాజీ బ్యాట్స్‌మన్ గౌతమ్ గంభీర్.. కెప్టెన్ విరాట్ కోహ్లీపై మరోసారి విరుచుకుపడ్డాడు. అతడి కెప్టెన్సీ అర్థం కావడం లేదని విమర్శించాడు. ఆదివారం రెండో వన్డేలో ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ ఆరంభంలో జస్ప్రీత్‌బుమ్రాను రెండు ఓవర్లే బౌలింగ్ చేయించడంపై అసహనం వ్యక్తం చేశాడు. కొత్త బంతితో షమి 1, 3 ఓవర్లు బౌలింగ్ చేయగా.. బుమ్రా 2,4 ఓవర్లు వేశాడు. ఆ రెండింటిలో అతడు 7 పరుగులే ఇచ్చాడు. ఆపై మళ్లీ తొమ్మిదో ఓవర్లో బౌలింగ్‌కు వచ్చాడు. మ్యాచ్ అనంతరం ఈఎస్పీఎన్ క్రిక్ఇన్ఫోతో గంభీర్ మాట్లాడాడు.
‘నిజం చెప్పాలంటే అతడి కెప్టెన్సీ అర్థం కావడం లేదు. ఆస్ట్రేలియా లాంటి బలమైన బ్యాటింగ్ లైనప్‌లో టాప్ఆర్డర్ వికెట్లు తీయడం ఎంత ముఖ్యమో తెలిసిన విషయమే. సహజంగా వన్డేల్లో బౌలర్లకు 4-3-3 ఓవర్ల చొప్పున స్పెల్ పద్ధతి ఉంటుంది. అలాంటిది ఒక ప్రధాన బౌలర్‌ను కొత్త బంతితో రెండు ఓవర్లకు పరిమితం చేయడం అర్థంకాలేదు. అదెలాంటి కెప్టెన్సీనో తెలియట్లేదు. దాన్ని విడమర్చి చెప్పడానికీ రావట్లేదు. ఇది టీ20 సిరీస్ కూడా కాదు. ఇది పూర్తిగా కెప్టెన్సీ వైఫల్యం. ఒకరి శక్తి సామర్థ్యాలను ప్రశ్నించనంత వరకూ అంతర్జాతీయ స్థాయిలో వాళ్లెంత ప్రతిభావంతులో గుర్తించడం కష్టం. టీమ్ఇండియా ఈ విషయంలో విఫలమైంది’ అని గంభీర్ పేర్కొన్నాడు.
స్పోర్ట్స్
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
చిత్ర వార్తలు
సినిమా
- బైడెన్.. హారిస్ సీక్రెట్ కోడ్ పేర్లు ఏంటంటే..!
- 2-1 కాదు 2-0!
- వైట్‌హౌస్‌లో విచిత్ర పెంపుడు జంతువులు!
- మీ పెద్దొళ్లున్నారే... :సెహ్వాగ్
- ఐపీఎల్ 2021: ఏ జట్టులో ఎవరున్నారంటే..
- ప్రజాస్వామ్యం గెలిచిన రోజు: బైడెన్
- తీరని లోటు మిగిల్చిన ఓటమి: వార్న్
- భారత్-ఎ జట్టుతో వాళ్లు గెలిచారు: పాంటింగ్
- ఇక చాలు
- వైట్‌హౌస్‌ను వీడిన ట్రంప్ దంపతులు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
