
తాజా వార్తలు
కోహ్లీ×గంభీర్: నిన్న విమర్శ.. నేడు ప్రశంస
ఇంటర్నెట్ డెస్క్: ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా తొలి రెండు వన్డేల్లో ఓడిపోయిన టీమ్ఇండియా సిరీస్‌ను చేజార్చుకున్న విషయం తెలిసిందే. దీంతో కోహ్లీ సారథ్యంపై మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశాడు. కానీ ఇప్పుడేమో పొగడ్తలతో ముంచెత్తాడు. వన్డే సిరీస్‌లో కింగ్ కోహ్లీ రెండు అరుదైన రికార్డులను సొంతం చేసుకున్నాడు. తొలి వన్డే సమయంలో అంతర్జాతీయ క్రికెట్లో అతి తక్కువ ఇన్నింగ్స్‌ల్లో 22వేల పరుగుల మైలురాయి చేరుకున్నాడు. మూడో వన్డేలో 23 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద వన్డే క్రికెట్లో అత్యంత వేగంగా 12వేల పరుగులు చేసిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు.
‘నీవు ఏది అనుకుంటావో అదే పొందగలవు. నువ్వేదైనా చేయగలవు. జట్టు గెలవడానికి అవసరమైన చివరి పరుగు చేసి హోటల్‌కు తిరిగొచ్చాక దేశం కోసం ఏదో చేశానని నీకు అప్పగించిన బాధ్యతపై నీవు చాలా సంతృప్తిగా ఉంటావు. కోహ్లీ సాధించిన వేల పరుగులు, సెంచరీలకు హాట్సాఫ్’ అని గంభీర్ ప్రశంసించాడు. ఇదిలా ఉంటే మూడో వన్డేలో 63 పరుగులతో రాణించిన కోహ్లీ వన్డే సిరీస్‌లో మొత్తంగా 173 పరుగులు చేశాడు. ఈ మ్యాచులో భారత్ 13 పరుగుల తేడాతో ఆస్ట్రేలియాపై విజయం సాధించింది. అదే స్ఫూర్తితో శుక్రవారం జరిగే టీ20 సిరీస్‌ను ఆరంభించనుంది.
స్పోర్ట్స్
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
చిత్ర వార్తలు
సినిమా
- ఇండస్ట్రీలో నాకు పోటీ ఎవరో ఇన్నాళ్లకు తెలిసింది
- మరో 6 పరుగులు చేసుంటే..
- నేను తెలుగింటి అల్లుడినే: సోనూసూద్
- సమాధానం కావాలా..నీ దేశానికి వెళ్లిపో
- గబ్బా కాదు..శార్దూల్-సుందర్‌ల దాబా: సెహ్వాగ్
- ఆ వార్తల్లో నిజం లేదు.. మోహన్‌బాబు టీమ్
- ‘ఉప్మాపాప’కు థాంక్స్ చెప్పిన రామ్..
- యాష్ లేకున్నా సుందర్ నష్టం చేశాడు: ఆసీస్
- టీమ్ఇండియా తొలి ఇన్నింగ్స్ 336 ఆలౌట్
- బైడెన్ తొలి సంతకం వీటిపైనే..!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
