close
Array ( ) 1

తాజా వార్తలు

Published : 30/05/2020 14:51 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

క్రిస్‌గేల్‌తో ఎప్పుడూ అలా అనిపించలేదు

వార్నర్‌కు భయపడినట్టు కనపడొద్దు: భజ్జీ

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రస్తుత క్రికెట్‌లో విధ్వంసకర బ్యాట్స్‌మెన్‌లో వెస్టిండీస్‌ ఓపెనర్‌ క్రిస్‌గేల్‌ ఒకడు. తనదైన రోజు ఏ బౌలర్‌నూ వదిలిపెట్టడు. బంతిని విసిరినంత ఈజీగా దాన్ని స్టాండ్స్‌లోకి తరలిస్తాడు. ఫార్మాట్‌ ఏదైనా దంచి కొట్టడమే అతడి లక్ష్యం. మరీ ముఖ్యంగా టీ20 క్రికెట్‌లో ఎలా రెచ్చిపోతాడో అందరికీ తెలిసిందే. ఇక ఐపీఎల్‌ విషయానికొస్తే ఇప్పటివరకు ఎవరికీ సాధ్యంకాని విధంగా అత్యధిక వ్యక్తిగత స్కోర్‌(175) నమోదు చేశాడు. అలాంటి విధ్వంసకర బ్యాట్స్‌మెన్‌కు బౌలింగ్‌ చేయాలంటే ఏ బౌలరైనా కచ్చితమైన వ్యూహంతో ముందడుగు వేయాలి.. లేదంటే సిక్సుల మోత మోగాల్సిందే. 

కాగా, క్రిస్‌గేల్‌ బ్యాటింగ్‌ విషయంపై ఇటీవల టీమ్‌ఇండియా వెటరన్‌ స్పిన్నర్‌ హర్భజన్‌సింగ్‌ ఓ క్రికెట్‌ కార్యక్రమంలో మాట్లాడుతూ.. అతడికి బౌలింగ్‌ చేయడం తనకేమీ కష్టంగా ఉండదన్నాడు. డేవిడ్‌ వార్నర్‌, క్రిస్‌గేల్‌ లాంటి బ్యాట్స్‌మెన్‌కు బౌలింగ్‌ చేయాలంటే ఎలాంటి వ్యూహం అమలు చేస్తారని భజ్జీని అడగ్గా పైవిధంగా స్పందించాడు. వార్నర్‌ అన్ని వైపులా షాట్లు ఆడగలడని, బ్యాక్‌ఫుట్‌లో అదరగొడతాడని చెప్పాడు. అతడికి బౌలింగ్‌ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలన్నాడు. మరీ ముఖ్యంగా బౌలర్‌ ముఖంలో భయం కనపడొద్దని తెలిపాడు. గేల్‌తో పోలిస్తే వార్నర్‌కు బౌలింగ్‌ చేయడమే తనకు కష్టంగా అనిపిస్తుందని పేర్కొన్నాడు. అనంతరం వెస్టిండీస్‌ బ్యాట్స్‌మన్‌ గురించి వివరిస్తూ..ఎవరైనా గేల్‌కు త్వరగా బంతులేస్తే సిక్సుల వర్షం కురిపిస్తాడని, మెల్లిగా బంతులేస్తే క్రీజు బయటకు వచ్చి ఆడతాడని తెలిపాడు. అలా ఆడటం యూనివర్స్‌బాస్‌కు ఇబ్బందిగా ఉంటుందని చెప్పాడు. ఆ విధంగానే క్రిస్‌గేల్‌కు బౌలింగ్‌ చేయడం తనకెప్పుడూ కష్టంగా అనిపించలేదని స్పష్టం చేశాడు. పవర్‌ప్లేల్లోనూ గేల్‌కు చాలాసార్లు బంతులేశానని.. అతడు స్వీప్‌షాట్లు లేదా మిడాన్‌ మీదుగా షాట్లు ఆడలేడని గుర్తుచేసుకున్నాడు. 


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.