కరెంట్‌ బిల్‌ చూసి అవాక్కయిన హర్భజన్‌

తాజా వార్తలు

Published : 28/07/2020 01:47 IST

కరెంట్‌ బిల్‌ చూసి అవాక్కయిన హర్భజన్‌

తాను కట్టేదానికంటే ఏడింతలు ఎక్కువట..

ముంబయి: తనకొచ్చిన కరెంటు బిల్లు చూసి టీమ్‌ఇండియా వెటరన్‌ క్రికెటర్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఆఫ్‌ స్పిన్నర్‌ హర్భజన్‌ సింగ్‌ అవాక్కయ్యాడు. సహజంగా తాను కట్టేదాని కన్నా ఏడింతలు ఎక్కువ వచ్చిందని చెప్పాడు. ముంబయి ఆదాని ఎలక్ట్రిసిటీ సంస్థ నుంచి ఇటీవల తనకు వచ్చిన మెసేజ్‌ను భజ్జీ ట్విటర్‌లో పోస్టు చేశాడు. అందులో చుట్టుపక్కల వాళ్లందరి బిల్లు కూడా తనకే ఇచ్చారా అంటూ ఆ సంస్థను నిలదీశాడు. ఈ నెల మొత్తం రూ.33,900 బాకీ ఉన్నట్లు తనకు వచ్చిన మెసేజ్‌ను చూపించాడు. 

కాగా, ఇటీవలి కాలంలో ఇలా కరెంట్‌ బిల్లులు అధికమొత్తంలో రావడం సాధారణం అయిపోయింది. ఇంతకుముందు బాలీవుడ్‌ నటి తాప్సీ సైతం తనకు రూ.36 వేలు వచ్చిందని, ఇప్పుడా ఇంట్లో ఎవరూ ఉండరని పేర్కొంది. మరోవైపు లాక్‌డౌన్‌ వేళ హైదరాబాద్‌లోనూ ఇలాంటి ఘటనలు చవిచూశాయి. సామాన్య జనాలకు సైతం దిమ్మతిరిగే కరెంట్‌ బిల్లులు వచ్చాయి. ఇదిలా ఉండగా, లాక్‌డౌన్‌ కారణంగా ఇన్ని రోజులు ఇంట్లో విశ్రాంతి తీసుకున్న హర్భజన్‌ త్వరలోనే యూఏఈకి పయనమయ్యే అవకాశం ఉంది. ఐపీఎల్‌ పదమూడో సీజన్‌ సెప్టెంబర్‌ 19 నుంచి ఆరంభమవుతుండగా, అన్ని ఫ్రాంఛైజీల కన్నా ముందే చెన్నై సూపర్‌ కింగ్స్‌ అక్కడికి చేరుకోనుంది. మార్చిలో సైతం ఆ జట్టు అన్ని జట్ల కన్నా ముందే శిక్షణా శిబిరం నిర్వహించిన సంగతి తెలిసిందే.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని