మాటలు రావట్లేదు: కోహ్లీ
close

తాజా వార్తలు

Updated : 19/12/2020 16:16 IST

మాటలు రావట్లేదు: కోహ్లీ

ఇంటర్నెట్‌డెస్క్‌: అడిలైడ్‌ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి డే/నైట్ టెస్టులో భారత్‌ ఘోరపరాజయాన్ని చవిచూసింది. ఎనిమిది వికెట్ల తేడాతో ఓటమిపాలై నాలుగు టెస్టు సిరీస్‌లో 0-1తో వెనుకంజలో నిలిచింది. అయితే టీమిండియా రెండో ఇన్నింగ్స్‌లో కేవలం 36 పరుగులకు పరిమితమై  ఎవరూ కోరుకోని చెత్తరికార్డు నమోదు చేసింది. టెస్టు చరిత్రలో భారత్‌కు ఓ ఇన్నింగ్స్‌లో ఇదే అత్యల్ప స్కోరు. కాగా, ఆసీస్‌ చేతిలో ఓటమిపై స్పందించడానికి మాటలు రావట్లేదని భారత సారథి విరాట్‌ కోహ్లీ అన్నాడు.

‘‘భావాన్ని వ్యక్తపరచడానికి మాటలు రావట్లేదు. 60 పరుగుల ఆధిక్యంతో మైదానంలోకి వచ్చిన మేం పేకమేడలా కుప్పకూలాం. రెండు రోజులు తీవ్రంగా శ్రమించి, జట్టు పటిష్ఠ స్థితిలో ఉన్నప్పుడు... ఓ గంట పేలవమైన ఆటతో దారుణమైన స్థితికి వెళ్లాం. అలాంటి దశలో విజయం సాధించడం అసాధ్యం. మేం మరింత తీవ్రతతో ఆడాల్సి ఉంది’’ అని కోహ్లీ అన్నాడు.

ఆస్ట్రేలియా బౌలర్లు తొలి ఇన్నింగ్స్‌లో మాదిరిగానే రెండో ఇన్నింగ్స్‌లో బౌలింగ్ చేశారని, కానీ బలహీనమైన ఆలోచన విధానం వల్లే వికెట్లు కోల్పోయామని కోహ్లీ అన్నాడు. ‘‘ఆ సమయంలో పరుగులు సాధించడం అసాధ్యం, బౌలర్లు ఆత్మవిశ్వాసంతో బంతులు వేస్తున్నారన్నట్లుగా ఆడుతున్నట్లు అనిపించింది. బ్యాటింగ్‌లో తీవ్రత లేకపోవడం, మంచి ప్రదేశాల్లో ఆసీస్‌ బౌలర్లు బౌలింగ్ చేయడంతో మా ప్రదర్శన ఇలా సాగింది’’ అని పేర్కొన్నాడు.

ఆస్ట్రేలియాతో జరిగే చివరి మూడు టెస్టులకు కోహ్లీ దూరమవుతున్న సంగతి తెలిసిందే. పితృత్వ సెలవులపై అతడు స్వదేశానికి తిరిగిరానున్నాడు. దీంతో టీమిండియా కెప్టెన్సీ బాధ్యతలు రహానె అందుకుంటాడు. అయితే మెల్‌బోర్న్‌ వేదికగా జరిగే రెండో టెస్టులో టీమిండియా బలంగా పుంజుకుంటుందని కోహ్లీ ఆశాభావం వ్యక్తంచేశాడు. జట్టుగా పోరాడితే మంచి ఫలితం వస్తుందని, భారత ఆటగాళ్లు తిరిగి గొప్పగా సత్తాచాటుతారని అన్నాడు. డిసెంబర్ 26 నుంచి మెల్‌బోర్న్‌ వేదికగా బాక్సింగ్‌డే‌ టెస్టు ప్రారంభమవుతుంది.

ఇదీ చదవండి

ఆస్ట్రేలియా ఘన విజయం


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని