close
Array ( ) 1

తాజా వార్తలు

Published : 04/06/2020 14:46 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

చచ్చిపోదామని 1,2,3 లెక్కపెట్టిన ఉతప్ప

బాల్కనీ నుంచి దూకకుండా ఏదో శక్తి ఆపిందన్న క్రికెటర్‌

ముంబయి: కుంగుబాటు, ఆత్మహత్య ఆలోచనలతో కెరీర్‌లో రెండేళ్లు సతమతం అయ్యానని టీమ్‌ఇండియా వెటరన్‌ క్రికెటర్‌ రాబిన్‌ ఉతప్ప అన్నాడు. ఒకానొక దశలో బాల్కనీ నుంచి దూకేద్దామని అనిపించేదన్నాడు. కానీ, ఏదో ఒక శక్తి తనను అడ్డుకుందని వెల్లడించాడు. రాయల్‌ రాజస్థాన్‌ ఫౌండేషన్‌ నిర్వహించిన ‘మనసు, దేహం, ఆత్మ’ లైవ్‌ సెషన్‌లో అతడు మాట్లాడాడు.

భారత్‌ తరఫున ఉతప్ప 46 వన్డేలు, 13 టీ20లు ఆడాడు. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో గతేడాది వరకు కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు ఆడాడు. ఈసారి వేలంలో అతడిని రూ.3 కోట్లకు రాజస్థాన్‌ రాయల్స్‌ తీసుకుంది. ‘2009-2011 వరకు రోజూ నేను ఇలాంటి పరిస్థితులే ఎదుర్కొన్నాను. క్రికెట్‌ గురించి కూడా ఆలోచించలేదు. ఎప్పుడూ ఆత్మహత్య ఆలోచనలే. ఈ రోజు బతికేదెలా అనే ఆలోచించేవాడిని. నా జీవితం ఎటుపోతోంది? నేను ఏ దారిలో వెళ్తున్నాను? ఇవే ఆలోచనలు. పరుగెత్తుకెళ్లి బాల్కనీ నుంచి దూకాలని కొన్ని రోజులు కుర్చీలో కూర్చొని మూడు వరకు లెక్కపెట్టేవాడిని. కానీ ఏదో శక్తి నన్ను ఆపేది’ అని ఉతప్ప అన్నాడు.

‘ఆ తర్వాత నన్ను నేను అర్థం చేసుకోవడం మొదలుపెట్టాను. నా జీవితంలో మార్పులు చేసుకొనేందుకు ఇతరుల సాయం తీసుకున్నాను. ఏం చేశానో తెలియదు. నెట్స్‌లో విపరీతంగా కష్టపడినా నా బ్యాటు నుంచి ఒక్క పరుగూ రాలేదు. గంటల కొద్దీ నెట్స్‌లో గడిపాను. అయినా కోరుకున్నది జరగలేదు. నాలో ఏదో సమస్య ఉందని నేను గుర్తించలేకపోయాను. ఎందుకంటే కొన్ని సార్లు మన తప్పుల్ని మనం అంగీకరించం. తప్పుల్ని గుర్తించడమే అత్యంత ముఖ్యం’ అని ఉతప్ప తెలిపాడు.

ఈ దశ ముగిశాక 2014-15 రంజీ సీజన్‌లో ఉతప్ప టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. అతడింకా వీడ్కోలు పలకలేదు కానీ 2015 తర్వాత టీమ్‌ఇండియాకు ఆడలేదు. చోటు దక్కనందుకు తానేమీ బాధపడడం లేదని అతడు అంటున్నాడు. ‘జీవితంలో ఎదగాలంటే కొన్ని ప్రతికూలతలు అవసరమే. వాటిని ఎదుర్కొంటేనే ఎత్తుకు చేరుకోగలం. నా ప్రతికూల అనుభవం పట్ల బాధపడటం లేదు. జీవితాన్ని కచ్చితంగా సమతూకం చేసుకోవాలి. సానుకూలత, ప్రతికూలత కచ్చితంగా అవసరమే’ అని అతడు వివరించాడు. ఒకప్పటితో పోలిస్తే ప్రస్తుతం క్రికెట్‌ మారిపోయిందన్నాడు. సరదా, పోటీ రెండూ పెరిగాయని పేర్కొన్నాడు.


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.